Tollywood : ఓరి బాబోయ్.. ‘ఏంటి వాటర్ ఇంకా కూలెక్కలేదా’.. పాప ఇప్పుడు ఇలా…

|

Oct 13, 2024 | 2:53 PM

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన ఈ పాపను గుర్తుపట్టారా..? తను ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. తన లెటెస్ట్ లుక్ చూసి నెటిజన్స్ స్టన్ అవుతున్నారు.

Tollywood : ఓరి బాబోయ్.. ఏంటి వాటర్ ఇంకా కూలెక్కలేదా.. పాప ఇప్పుడు ఇలా...
Follow us on

ఏంటి గురూ ఈ మేకోవర్స్.. నిన్నమొన్నటివరకు చైల్డ్ ఆర్టిస్టులుగా రాణించినవారు… ఇప్పుడు గుర్తుపట్టలేని విధంగా మారిపోతున్నారు. వారు వీరేనా అని ఒకటికి.. రెండుసార్లు తడుముకోవాల్సి వస్తోంది. అలా వెండితెరపై ఇలా మెరిసి అలా మాయమైన ఓ బాలనటి ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఆమె ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంతలా మారిపోవాయ్ ఏంటి అమ్మాయ్ అని కామెంట్స్ పెడుతున్నారు. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని మీరు గుర్తుపట్టారా..? తను సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాలో నటించింది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. తెలుగు చిత్రపరిశ్రమలో చాలాకాలం తర్వాత ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా వసూళ్ల సునామి సృష్టించింది. ఈ సినిమాలో ఎందరో అగ్రనటీనటులు యాక్ట్ చేశారు.

అయితే మూవీలో ఏంటి వాటర్ ఇంకా కూలెక్కలేదా అంటూ అచ్చమైన, స్వచ్చమైన గోదావరి యాసలో మాట్లాడే పాప మీకు గుర్తు ఉండే ఉండాలి. తన పేరు రచన. సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్లు చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ అమ్మాయికి వరసకు మామయ్య అవుతారు. ఓసారి శ్రీకాంత్ వాళ్ల ఇంటికి వెళ్లిన సందర్భంలో.. ఆమె యాస నచ్చి.. సినిమాలో బాగుంటుందని పెట్టారట.

ఇటీవల సోషల్ మీడియా రీల్స్‌లో ఈ డైలాగ్ మళ్ళీ వైరల్ అవ్వడంతో ఆ అమ్మాయి గురించి అందరూ సెర్చ్ చేస్తున్నారు. అయితే రచన ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. పెళ్లి చేసుకొని పాపతో ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో మంచి రీల్స్ చేస్తూ ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటుంది. ఈమె ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే రచన పొడవైన కురులు చూస్తే.. చాలామంది కుళ్లుకుంటారు. తన లేటెస్ట్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి