Sarkaru Vaari Paata Release Live : అట్లుంటది మహేష్ సినిమా అంటే.. సర్కారు వారి పాటకు సూపర్ రెస్పాన్స్
సూపర్ స్టార్ మహేష్(Mahesh Babu) మోస్ట్ అవేటెడ్ మూవీ సర్కారు వారి పాట ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత మహేష్ బాబు సినిమా రిలీజ్ అవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
సూపర్ స్టార్ మహేష్(Mahesh Babu) మోస్ట్ అవేటెడ్ మూవీ సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత మహేష్ బాబు సినిమా రిలీజ్ అవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. మహేష్ సినిమా అంటే మామూలుగానే అభిమానులు హంగామా చేస్తారు. ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే బెనిఫిట్ షోస్ మొదలవ్వడంతో సినిమా సూపర్ హిట్ అనే టాక్ బయటకు వచ్చేసింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. పోకిరి సినిమా తర్వాత మహేష్ మళ్ళీ ఆ రేంజ్ మాస్ యాక్షన్ ఎంటటైనర్ తో అభిమానుల ముందుకు రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
థియేటర్స్ దగ్గర జాతర వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రమోషన్స్ తో హోరెత్తించిన చిత్రయూనిట్ సినిమాకు కావాల్సినంత బజ్ ను క్రియేట్ చేశారు. ఇక టీజర్ , ట్రైలర్ అయితే సినిమా పై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఇప్పడు ఆ అంచనాలను సినిమా అందుకుందన్న టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Kalyani Priyadarshan: క్యూట్ ఫొటోస్‌తో కేక పెట్టిస్తున్న కుర్ర బ్యూటీ.. వైరల్ అవుతున్న కళ్యాణి ప్రియదర్శన్ ఫోటోలు
Prabhas: ప్రభాస్ మారుతి మూవీ ‘రాజా డీలక్స్’ వచ్చేది అప్పుడేనా..
LIVE NEWS & UPDATES
-
ఓవర్సీస్‌లో 350 లొకేషన్స్‌లో..
ఓవర్సీస్‌లో 350 లొకేషన్స్‌లో రిలీజై ప్రీమియర్ షోలతోనే 8 లక్షల డాలర్ల వసూళ్లు రాబట్టింది. యూఎస్‌లో స్క్రీన్స్ వద్ద మహేష్ ఫ్యాన్స్ జోష్ ఓ రేంజ్‌లో వుంది.
-
సినిమా ఆరంభం నుంచి పాజిటివ్ వైబ్స్..
ట్రయిలర్‌తో వచ్చిన హైప్‌ని సస్టెయిన్ చేస్తోంది సర్కారువారి పాట. సినిమా ఆరంభం నుంచి పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఎక్స్‌పెక్టేషన్స్‌కి మించి క్వాలిటీ కనిపిస్తోందని, ఇది పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని సెలబ్రిటీలు ట్వీట్ చేస్తున్నారు. రిసెంట్ టైమ్స్‌లో వచ్చిన వెరీ రిఫ్రెషింగ్ మూవీ అంటూ సర్కారువారి పాటకు పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ షురూ అయ్యాయి.
-
-
అలరిస్తున్న మహేష్‌బాబు మేనరిజమ్
మహేష్‌బాబు మేనరిజమ్ కొత్తగా వుందని, పూర్తిగా ఎంజాయ్ చేశామని ఖుషీ అవుతున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. పోకిరీ తరహా పెర్ఫామెన్స్ మరోసారి చూపించారన్నది ఆడియన్స్ నుంచి వస్తున్న యునానిమస్ ఒపీనియన్. కీర్తి సురేష్ గ్లామర్ మరో స్పెషల్ ఎసెట్. బ్యాంక్ స్కామ్ నేపథ్యంతో తీసిన సర్కారువారి పాట కంటెంట్ కొత్తగా వుందంటున్నారు న్యూట్రల్ ఆడియన్స్
-
రాజమహేంద్రవరంలో మహేష్ అభిమానుల రచ్చ
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మహేష్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో పాలాభిషేకాలు, పటాసులతో హంగామా చేశారు.
-
థియేటర్ల దగ్గర సౌండ్ ఓ రేంజ్‌లో వుంది
సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటించిన సర్కారువారి పాట ఇవాళే గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజైంది. ఫస్ట్ టాక్ బెటర్‌గా వుండడంతో ఎటుచూసినా పాజిటివ్ రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. తెల్లవారుఝామున మూడున్నరకే ప్రీమియర్స్ షురూ అయ్యాయి. ఫ్యాన్స్ హంగామాతో థియేటర్ల వద్ద సౌండ్ ఓ రేంజ్‌లో వుంది. సరిలేరు నీకెవ్వరు రిలీజయ్యాక రెండేళ్ల గ్యాప్ ఇచ్చి వచ్చిన మహేష్ మూవీగా సర్కారువారిపాటపై క్రేజ్ విపరీతంగా వుంది.
-
-
మాస్ మహేష్ అదరగొట్టేస్తున్నారు..
ఆసక్తికర ట్విస్ట్ లతో సినిమాలో సీరియస్ నెస్ పెరిగింది. ప్రేక్షకులకు కావాల్సినన్ని ఎలివేషన్స్ ఉన్నాయని అంటున్నారు చూసిన వారు.
-
మహేష్ కామెడీ టైమింగ్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్
సర్కారు వారి పాట సినిమాలో మహేష్ తన నటనతో ఆకట్టుకున్నారు. మహేష్ కామెడీ టైమింగ్ ఫ్యాన్స్ ను కట్టిపడేస్తుంది.
-
విదేశాల్లో ఊపేస్తున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్..
కెనడాలో థియేటర్స్ లో రచ్చ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్..
Babu Land aithe!!! ??
VC: Canada Show#SarkaruVaariPaata
Super ? @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents @MythriOfficial @saregamasouth pic.twitter.com/JfXSpHbEBI
— Maheshbabu Fan Club (@MaheshBabu_FC) May 11, 2022
-
సర్కారు వారి పాట సినిమా చూసిన మహేష్ సతీమణి
హైదరాబాద్ లోని భ్రమరాంబ, మల్లిఖార్జున, విశ్వనాథ్, శ్రీ రాములు థియేటర్ లలో ప్రీమియర్ షో లు నిర్వహించారు. భ్రమరాంబ థియేటర్ లో నిర్వహించిన ఫ్యాన్స్ షోలో..అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, డైరెక్టర్ హరీష్ శంకర్ తదితరులు హాజరయ్యారు..
Published On - May 12,2022 6:51 AM