Manchi Rojulochaie: మారుతి డైరెక్షన్ లో సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న థియేటర్స్ లోకి వస్తుంది. రేపు కొన్ని చోట్ల పెయిడ్ ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి. ఈ సందర్భంగా హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ..
సరిగ్గా ‘ఏక్ మినీ కథ’ రిలీజ్ కి వారం ముందు మా ప్రొడ్యూసర్స్ మారుతి గారు కథ చెప్తారు వెళ్లి వినమన్నారు. మారుతి గారితో సినిమా అనగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. వెళ్లి కలవగానే ఫస్ట్ హాఫ్ చెప్పారు చాలా బాగుంది హిలేరియస్ గా ఉందని చెప్పేసి వచ్చాను. ఏక్ మినీ కథ రిలీజ్ తర్వాత సెకండాఫ్ చెప్పారు. ఇంకా ఎగ్జైట్ అయ్యాను. ఏక్ మినీ కథ రిలీజ్ అవ్వగానే ఈ సినిమా స్టార్ట్ అయింది. అలా ఈ ప్రాజెక్ట్ సెట్ అయింది అన్నారు.
సినిమాలో నేను కంప్లీట్ గా మారుతి గారి హీరోలానే కనిపిస్తాను. ఆయన హీరోలు చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తూ మంచి టైమింగ్ తో కామెడీ పండిస్తారు. నేనూ అదే చేశాను అన్నారు. ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఆయన రాసింది రాసినట్టు డెలివరీ చేస్తే చాలు సూపర్ గా వర్కౌట్ అయిపోద్ది. సినిమాలో నా క్యారెక్టర్ కి మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. కెరీర్ స్టార్టింగ్ లోనే మారుతి గారి లాంటి ఎక్స్ పీరియన్స్ ఉన్న డైరెక్టర్ తో సినిమా చేయడం నా అదృష్టం అంటూ చెప్పుకొచ్చారు సంతోష్. అలాగే యూవీ క్రియేషన్స్ అంటే నా హోమ్ బేనర్. ఎప్పుడూ ఫ్రీ గా ఉన్నా యూవీ ఆఫీస్ కొచ్చి కుర్చుంటాను. ఇక్కడ నాకు చాలా ఫ్రీడం ఉంటుంది. వంశీ అన్న వికీ అన్న అందరూ నన్ను ఓ బ్రదర్ లా ట్రీట్ చేస్తుంటారు. వాళ్ళతో నా బాండింగ్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ నాతో సినిమాలు చేస్తున్నందుకు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు సంతోష్.
మరిన్ని ఇక్కడ చదవండి :