Sankranthiki Vasthunam: మరో రికార్డ్ ఖాతాలో వేసుకున్న బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 14న విడుదలై సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో వెంకటేష్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు.

Sankranthiki Vasthunam: మరో రికార్డ్ ఖాతాలో వేసుకున్న బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం
Sankranthiki Vasthunnam

Updated on: Mar 04, 2025 | 5:55 PM

ఈ ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ రివ్యూస్ అందుకుంది సంక్రాంతికి వస్తున్నాం. ఊహించిన దాని కంటే రెండింతల విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా.  డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్‏కు ఫ్యామిలీ అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. చిన్నా, పెద్దా అందరూ ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించగా.. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో ఒకప్పటి వెంకీ స్టైల్, మేనరిజం, కామెడీ టైమింగ్ మరోసారి తెరపై చూపించారు అనిల్ రావిపూడి. దీంతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల ఫ్యామిలీ అడియన్స్ జై కొట్టారు. మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో దూసుకుపోతుంది.

రీసెంట్ గానే సంక్రాంతికి వస్తున్నాం సినిమా టీవీలో టెలికాస్ట్ అయ్యింది. ప్రముఖ ఛానెల్ జీ 5 సంక్రాంతికి వస్తున్నాం సినిమాను టెలికాస్ట్ చేసింది. ఇప్పటికే ఎన్నో రికార్డ్ అందుకున్న సంక్రాంతికి వస్తున్నాం తాజాగా మరో అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది. 92 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది ఈ మూవీ. ఇది నిజంగా రికార్డ్ అనే చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత పెద్ద సినిమా అయినా రెండు మూడు వారాలకంటే థియేటర్స్ లో ఉండటం లేదు. అలాంటిది సంక్రాంతికి వస్తున్నాం సినిమా 92 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది.

ఈ విషయాన్నీ మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఇప్పటివరకూ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు తన ఖాతాలో వేసుకున్నట్లు చిత్రబృందం తెలిపింది. వెంకటేష్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఇక ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంది. అంతే కాదు ఓటీటీలోనూ ఈ సినిమా నయా రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం 12 గంటల్లోనే 13 లక్షల మంది వీక్షించారని జీ 5 తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.