Sandeep Reddy Vanga: యానిమల్ పై ఆర్జీవీ ఇచ్చిన రివ్యూ పై సందీప్ క్రేజీ రియాక్షన్

సందీప్ రెడ్డి ఎవరితో సినిమా చేయనున్నాడని అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో రీమేక్ చేశాడు సందీప్. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా అక్కడ కూడా సూపర్ హిట్ అందుకుంది. ఆతర్వాత బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమా చేశాడు

Sandeep Reddy Vanga: యానిమల్ పై ఆర్జీవీ ఇచ్చిన రివ్యూ పై సందీప్ క్రేజీ రియాక్షన్
Sandeep Reddy Vanga

Updated on: Dec 06, 2023 | 8:29 AM

అర్జున్ రెడ్డి సినిమాతో లోవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత సందీప్ రెడ్డి ఎవరితో సినిమా చేయనున్నాడని అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో రీమేక్ చేశాడు సందీప్. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా అక్కడ కూడా సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యానిమల్ మూవీ పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పలు భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల నుంచి సూపర్ హిట్ రెస్పాన్స్ వస్తుంది. అలాగే కలెక్షన్స్ పరంగాను దూసుకుపోతుంది యానిమల్.

విడుదలకు ముందు యానిమల్ సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఆ అంచనాలను అందుకుంది యానిమల్ మూవీ. యానిమల్ సినిమా పై ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు తమ రివ్యూలు ఇచ్చారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా యానిమల్ సినిమా పై తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఇటీవలే సినిమా చూశాను. చాలాబాగా నచ్చింది అంటూ దర్శకుడు సందీప్ ను మెచ్చుకుంటూ ఆయన ఓ ట్వీట్ ను షేర్ చేశాడు.

దానికి సందీప్ రిప్లే ఇస్తూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. “మిస్టర్ రామ్ గోపాల్ వర్మ చేసినంత మరే ఇతర దర్శకుడు ఇండియన్ సినిమాకి అందించలేదని నేను నమ్ముతున్నాను.. నా ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ నుంచి నా ఫిల్మ్ యానిమల్ రివ్యూ రావడం. తనదైన శైలిలో వ్రాసిన రెండు విషయాలు మినహాయించి అన్నింటికీ నిజంగా కృతజ్ఞతలు” అంటూ సందీప్ రిప్లే ఇచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.