Ooru Peru Bhairavakona Collections: ఎట్టకేలకు హిట్టు కొట్టిన యంగ్ హీరో.. ‘ఊరు పేరు భైరవకోన’ ఫస్ట్ డే కలెక్షన్స్..
భైరవకోన అనే ఊరిలో అడుగుపెట్టిన వారెవరు ప్రాణాలతో తిరిగిరారు. కేవలం కార్తీక మాసంలో రాత్రి సమయంలో మాత్రమే ఆ ఊరి తలుపులు తెరుచుకుంటాయి. అయితే ఒక రోజు రాత్రి పెళ్లి లో దొంగతనం చేసి పోలీసుల నుంచి తప్పించుకుని వస్తున్న బసవ (సందీప్ కిషన్), తన స్నేహితుడు జాన్ (వైవా హర్ష), అగ్రహారం గీత (కావ్య థాపర్)తో కలిసి అనుకోకుండా ఆ ఊరిలోకి వెళ్తారు. తర్వాత వారికి విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. భైరవకోన ఊరిలో వారు ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నారు ?

చాలా కాలం తర్వాత హీరో సందీప్ కిషన్ నటించిన సినిమా ‘ఊరు పేరు భైరవకోన ‘. డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్ ఫిబ్రవరి 16న గ్రాండ్గా రిలీజ్ అయ్యింది. నిన్న ఉదయం నుంచే ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. ఇప్పటివరకు సందీప్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది హిట్ మూవీగా నిలిచింది ఈ సినిమా. మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ దాదాపు రూ. 6.3 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా నైజాం ఏరియాలో కోటిన్నర వరకు ఈమూవీ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. విడుదలకు ముందే ట్రైలర్, టీజర్, పాటలతో మూవీపై అంచనాలను క్రియేట్ చేసింది చిత్రయూనిట్. దీంతో అటు ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం భారీగానే జరిగింది. సందీప్ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల్లో ఇది ఒకటి. దాదాపు 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
తొలిరోజే రూ.6 కోట్ల మూడు లక్షల వరకు గ్రాస్.. మూడు కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ప్రీమియర్ షోలతో మిక్స్డ్ టాక్ అందుకున్న సినిమా.. రిలీజ్ తర్వాత మాత్రం పాజిటివ్ టాక్ అందుకుంది. ఈ మూవీలో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిషోర్, హర్ష కీలకపాత్రలు పోషించారు. విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్ ఖాతాలో చాలా కాలం తర్వాత సరైన హిట్టు పడింది.
ఊరు పేరు భైరవకోన కథ విషయానికి వస్తే..
భైరవకోన అనే ఊరిలో అడుగుపెట్టిన వారెవరు ప్రాణాలతో తిరిగిరారు. కేవలం కార్తీక మాసంలో రాత్రి సమయంలో మాత్రమే ఆ ఊరి తలుపులు తెరుచుకుంటాయి. అయితే ఒక రోజు రాత్రి పెళ్లి లో దొంగతనం చేసి పోలీసుల నుంచి తప్పించుకుని వస్తున్న బసవ (సందీప్ కిషన్), తన స్నేహితుడు జాన్ (వైవా హర్ష), అగ్రహారం గీత (కావ్య థాపర్)తో కలిసి అనుకోకుండా ఆ ఊరిలోకి వెళ్తారు. తర్వాత వారికి విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. భైరవకోన ఊరిలో వారు ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నారు ? గరుడ పురణాంలో కనిపించకుండా పోయిన నాలుగు పేజీలకు.. ఆ ఊరికి ఉన్న సంబంధం ఏంటీ ? భైరవకోన ఊరి నుంచి బసవ గ్యాంగ్ బయటపడిందా ? అనేది సినిమా.
So Indebted to your Love & Affection♥️
నా మీద ప్రయోగించబడిన అస్త్రాలన్నిటిని దాటించి ఇది మీరు నాకు అందించిన విజయం, నా ప్రాణం అడ్డేసైన సరే, నా కష్టంతో మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎల్లప్పటికి నిలబెట్టుకుంటాను 🙏🏽
#OoruPeruBhairavaKona pic.twitter.com/YPDoITSZzo
— Sundeep Kishan (@sundeepkishan) February 17, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
