Michael Teaser: మైఖేల్ టీజర్ వచ్చేసింది.. కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్‏తో అదరగొట్టిన సందీప్, విజయ్ సేతుపతి..

|

Oct 20, 2022 | 6:40 PM

వేటాడం రాని జంతువులే వేటాడే నోటికి చిక్కుతాయ్ మైఖేల్ .. అనే డైలాగ్‏తో టీజర్ ప్రారంభం కాగా.. ఫుల్ మాస్ లుక్‏లో కనిపించారు సందీప్, విజయ్ సేతుపతి.. వేంటాడి ఆకలి తీర్చుకోవడానికి వేటాడం తెలియాల్సిన పనిలేదు మాస్టర్

Michael Teaser: మైఖేల్ టీజర్ వచ్చేసింది.. కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్‏తో అదరగొట్టిన సందీప్, విజయ్ సేతుపతి..
Michael
Follow us on

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా మైఖేల్. డైరెక్టర్ జయకోడి రంజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరుణ్ సందేశ్, అనసూయ, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలలో నటిస్తుండడంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇందులో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‏గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్న ఈ మూవీ టీజర్ ను గురువారం సాయంత్రం న్యాచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు.

వేటాడం రాని జంతువులే వేటాడే నోటికి చిక్కుతాయ్ మైఖేల్ .. అనే డైలాగ్‏తో టీజర్ ప్రారంభం కాగా.. ఫుల్ మాస్ లుక్‏లో కనిపించారు సందీప్, విజయ్ సేతుపతి.. వేంటాడి ఆకలి తీర్చుకోవడానికి వేటాడం తెలియాల్సిన పనిలేదు మాస్టర్ అంటూ సందీప్ చెప్పడం.. మైఖేల్ మన్నించేటప్పుడు మనం దేవుడవుతామ్.. అనగా.. నేను మనిషిగానే ఉంటాను మాస్టర్ దేవుడవ్వాలనే ఆశలేదు అంటూ సందీప్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

గ్యాంగ్ స్టర్ డ్రామా, బ్యాక్ డ్రామాగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ.. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.