శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసు : నటీమణులకు అండర్‌వరల్డ్‌ డాన్‌లతో సంబంధాలు..!

 శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసులో నటీమణులు రాగిణి  ద్వివేది, సంజన గల్రానిల ఈడీ విచారణ ఆదివారం ముగిసింది.  కోర్టు అనుమతితో వారిని పరప్పన జైలులో ఐదు రోజుల పాటు విచారించారు అధికారులు.

శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసు : నటీమణులకు అండర్‌వరల్డ్‌ డాన్‌లతో సంబంధాలు..!

Updated on: Oct 05, 2020 | 5:35 PM

 శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసులో నటీమణులు రాగిణి  ద్వివేది, సంజన గల్రానిల ఈడీ విచారణ ఆదివారం ముగిసింది.  కోర్టు అనుమతితో వారిని పరప్పన జైలులో ఐదు రోజుల పాటు విచారించారు అధికారులు. సినిమాలు చేయడం ద్వారా ఎంతెంత ఆర్జించారనే వివరాలను సేకరించారు. రాగిణి తండ్రి రిటైర్డు ఆర్మీ అధికారి కాగా, ఆయన పలు వివరాలను ఈడీకి వెల్లడించారు.

 మరో నటి సంజనను కూడా ఈడీ అధికారులు ప్రశ్నలతో ముంచెత్తినట్లు సమాచారం. ఎన్ని సినిమాలలో నటించారు. ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఎంత డబ్బు సినిమాల ద్వారా సంపాదించారు. తండ్రి నుంచి వచ్చింది ఎంత?, ఇటీవల ఏయే ఆస్తులు కొనుగోలు చేశారు… లాంటి ప్రశ్నలు ఈడీ అధికారులు సంధించినట్లు తెలుస్తోంది. వివిధ భాషల్లో 42 సినిమాలలో నటించిన సంజన ఇండస్ట్రీలో పెద్ద పేరును సంపాదించలేకపోయినా సంపదకు మాత్రం ఢోకా లేదని గుర్తించారు. ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయో సమాచారం కోసం ఈడీ ఇప్పటికే ఐటీ శాఖకు లేఖ రాసింది.  (  రైతులకు అలెర్ట్ : పీఎం కిసాన్ స్కీమ్ డబ్బు పడకపోతే ఇలా చేయండి ! )

రాగిణి, సంజనల విచారణలో పలు ముఖ్యమైన సమచారాన్ని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు సేకరించారు. కాగా మరికొన్ని రోజులు ఇద్దరినీ ప్రశ్నించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.  రౌడీలు, అండర్‌వరల్డ్‌ డాన్‌లతో ఈ నటీమణులకు సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. బెంగళూరులో వారికి సహయ సహకారాలు అందించిన కొందరు రౌడీలపై ఫోకస్ పెట్టారు. ఇక హైకోర్టులో బెయిలు కోసం నటీమణులు విశ్వప్రయత్నం చేస్తున్నారు.   ( శ్రీవారి భక్తులకు శుభవార్త, దర్శనం టికెట్ల అదనపు కోటా విడుదల )