శ్రీవారి భక్తులకు శుభవార్త, దర్శనం టికెట్ల అదనపు కోటా విడుదల

ఎక్కువ మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైైవం ఏడుకొండల వెంకన్న దర్శన భాగ్యం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంటోంది.

శ్రీవారి భక్తులకు శుభవార్త, దర్శనం టికెట్ల అదనపు కోటా విడుదల
T
Follow us

|

Updated on: Oct 05, 2020 | 5:18 PM

ఎక్కువ మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైైవం ఏడుకొండల వెంకన్న దర్శన భాగ్యం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందడంతో లాక్‌డౌన్ కారణంగా మార్చిలో ఆలయంలో భక్తులకు ప్రవేశం నిలిపివేశారు. అన్‌లాక్‌లో ప్రక్రియలో భాగంగా ఆలయాలను తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు టీటీడీ భక్తులకు శ్రీవారి స్వామి వారి దర్శనం కల్పిస్తోంది. తాజాగా సోమవారం నుంచి మరింత మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు కోటాను విడుదల చేసింది. సోమవారం నుంచి 14వ తేదీ వరకు, 25వ తేదీ నుంచి 31 వరకు అదనంగా రెండు స్లాట్లల్లో మూడువేల మంది దర్శనం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం రాత్రి 9, 10 గంటల స్లాట్లు కేటాయించారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఈ నెల 15 నుంచి 24 మధ్య దర్శన టికెట్లను తితిదే విడుదల చేయలేదు.

తాజాగా తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది. ఆదివారం రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీకి ఆదాయం వచ్చింది. ఆదివారం వెంకన్నను 20,228 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీలో రూ.2.14కోట్లు సమర్పించుకున్నారు. అలాగే 6,556 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఈ నెల 16 నుంచి 24వ తేది వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కరోనా నిబంధనలను అనుసరిస్తూ ఈ సారి మాడవీధుల్లో వాహన సేవల ఊరేగింపు జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ ప్రారంభించింది. ( రైతులకు అలెర్ట్ : పీఎం కిసాన్ స్కీమ్ డబ్బు పడకపోతే ఇలా చేయండి ! )

Latest Articles