Yash: యష్ సిస్టర్‌గా స్టార్ హీరోయిన్.. కరీనా కపూర్ ప్లేస్‌లో ఆ ముద్దుగుమ్మ

ప్రస్తుతం యష్ టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు. యష్ ఫోకస్ ఇప్పుడు 'టాక్సిక్' సినిమా ఉంది. ఈ చిత్రంలో నటీనటుల గురించి అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. అయినా కూడా ఈ సినిమా గురించి రకరకాల గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి జాతీయ స్థాయిలో పేరున్న నటులను దింపుతున్నట్టు తెలుస్తోంది.

Yash: యష్ సిస్టర్‌గా స్టార్ హీరోయిన్.. కరీనా కపూర్ ప్లేస్‌లో ఆ ముద్దుగుమ్మ
Yash
Follow us

|

Updated on: May 04, 2024 | 4:11 PM

పాన్ ఇండియా స్టార్ యష్ కేజీఎఫ్ సినిమాతో ఎంత పెద్ద విజయం అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్ పార్ట్ 1, కేజీఎఫ్ పార్ట్ 2 సినిమాలు పాన్ ఇండియా హిట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు యష్ సినిమా కోసం అన్ని భాషల ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తుంది. ప్రస్తుతం యష్ టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు. యష్ ఫోకస్ ఇప్పుడు ‘టాక్సిక్’ సినిమా ఉంది. ఈ చిత్రంలో నటీనటుల గురించి అధికారిక సమాచారం ఇవ్వలేదు. అయినా కూడా ఈ సినిమా గురించి రకరకాల గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి జాతీయ స్థాయిలో పేరున్న నటులను దింపుతున్నట్టు తెలుస్తోంది. నటి కరీనా కపూర్ ఖాన్ పేరు కొన్ని రోజుల క్రితం వినిపించింది. అయితే ఇప్పుడు కరీనా ‘టాక్సిక్’ సినిమా నుంచి తప్పుకున్నట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి.

రిపోర్ట్స్ ప్రకారం, డేట్ సమస్యల కారణంగా కరీనా కపూర్ ఖాన్ ‘టాక్సిక్’ సినిమానుంచి తప్పుకుంది. ఈ సినిమాలో నటించడం కరీనా చాలా ఇష్టమట.. కానీ కాల్ షీట్స్ కారణంగా ఆమె ఈ మూవీ నుంచి వచ్చిందని తెలుస్తోంది. పెద్ద సినిమాలంటే చాలా గాసిప్స్ వినిపిస్తున్నాయి. అదే విధంగా ‘టాక్సిక్’ సినిమాలో యష్ సోదరి పాత్రలో కరీనా కపూర్ నటిస్తుందని పుకార్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో నటించడం లేదని అంటున్నారు. ఆమె పాత్రలో ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుందని తెలుస్తోంది. నయన్ ఇప్పుడు యష్ కు సిస్టర్ గా నటిస్తుందని తెలుస్తోంది.

అయితే దీని పై చిత్ర బృందం నుంచి అధికారిక సమాచారం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ వార్తలపై నయన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ భారీ విజయం తర్వాత యష్ అంగీకరించిన సినిమా ఇది. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ ప్లానింగ్‌తో ఈ సినిమాను  ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ సంస్థ నిర్మిస్తుంది.

View this post on Instagram

A post shared by Yash (@thenameisyash)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.