‘బాహుబలి’ సిరీస్, ‘సాహో’ సినిమాల తర్వాత యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’. పూజాహెగ్డే డార్లింగ్‌తో రొమాన్స్ చేయనుంది. ‘జిల్’ లాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించిన రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కాగా వింటేజ్ అండ్ పీరియాడికల్ లవ్ స్టోరీలో విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించనున్నాడు ప్రభాస్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, గ్లింప్స్, పాటలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. కాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. వరుసగా అప్డేట్స్ ఇస్తోంది.
కాగా ఇటీవల ‘రాధేశ్యామ్’ నుంచి ‘సంచారి’ పాట విడుదలైన సంగతి తెలిసిందే. ‘చలో..చలో.. సంచారి! చల్ చలో.. చలో! చలో.. చలో.. సంచారి! కొత్త నేలపై’ అనే లిరిక్స్‌తో సాగే ఈ పాటలో ప్రభాస్ లుక్స్, విజువల్స్‌కు లుక్స్‌కు విశేష స్పందన వచ్చింది. దీంతో ఈ పాట ఫుల్‌సాంగ్‌ను విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్రబృందం. ఇందులో కొత్తగా కౌబాయ్ గెటప్‌లో కనిపించి ఫ్యా్న్స్‌ను ఆకట్టుకున్నాడు డార్లింగ్. అదేవిధంగా యూరప్‌లోని మంచుకొండల్లో చిత్రీకరించిన దృశ్యాలు, విజువల్స్ ఎంతో గ్రాండియర్‌గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ‘సంచారి’ పాట యూట్యూబ్‌లో దూసుకెళుతోంది. విడుదలైన గంటలోపే వన్ మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. కాగా ఈ పాటను తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఆలపించిగా కృష్ణకాంత్ సాహిత్యం అందించాడు. జస్టిన్ ప్రభాకరణ్ స్వరాలు సమకూర్చారు.
Also Read:
Mistake: ఒక్క పాటకోసం 40 మంది లిల్లీపుట్స్.. ఆకట్టుకుంటున్న ‘మిస్టేక్’ మూవీ సాంగ్..
Allu Arjun Pushpa movie: ‘తగ్గేదే లే’ అంటున్న ‘పుష్ప’ ఫ్యాన్స్.. 5 షోలకు అనుమతి.. (వీడియో)