కొబ్బరి మట్ట: సంపూ కలెక్షన్స్‌తో చంపేస్తున్నాడు!

|

Aug 12, 2019 | 4:53 PM

ఎన్నో అవాంతరాల తరువాత కొబ్బరి మట్ట చిత్రం ఎట్టకేలకు ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభిన‌యంలో ‘హృద‌య‌కాలేయం’ సృష్టిక‌ర్త స్టీవెన్ శంక‌ర్ అందించిన క‌థ‌, క‌థ‌నంతో రూప‌క్ రొనాల్డ్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. బడ్జెట్ సమస్యల కారణంగా సినిమాకి సరైన ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించకపోయినా.. మౌత్ టాక్‌తో మూవీ మంచి కలెక్షన్లు రాబడుతోందది. కలెక్షన్ల విషయంలో కూడా సంపూర్ణేష్ బాబు స్టార్ హీరోలను వెనక్కి […]

కొబ్బరి మట్ట: సంపూ కలెక్షన్స్‌తో చంపేస్తున్నాడు!
Burning Star
Follow us on

ఎన్నో అవాంతరాల తరువాత కొబ్బరి మట్ట చిత్రం ఎట్టకేలకు ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభిన‌యంలో ‘హృద‌య‌కాలేయం’ సృష్టిక‌ర్త స్టీవెన్ శంక‌ర్ అందించిన క‌థ‌, క‌థ‌నంతో రూప‌క్ రొనాల్డ్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. బడ్జెట్ సమస్యల కారణంగా సినిమాకి సరైన ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించకపోయినా.. మౌత్ టాక్‌తో మూవీ మంచి కలెక్షన్లు రాబడుతోందది. కలెక్షన్ల విషయంలో కూడా సంపూర్ణేష్ బాబు స్టార్ హీరోలను వెనక్కి నెట్టి తన సత్తా చాటుతున్నాడు.

శనివారం నాడు విడుదలైన ఈ సినిమా హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో సరికొత్త రికార్డులను నమోదు చేసింది. రూ.2,88,111 వసూలు చేసి సత్తా చాటింది. ఈ సినిమా కంటే ఒక్కరోజు ముందుగ రిలీజైన ‘మన్మథుడు 2’ సినిమాకి రూ. 2,83,950 కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. ఈ లెక్కన చూసుకుంటే సంపూ.. సీనియర్ హీరో నాగార్జునని మించిపోయాడనే చెప్పాలి. ఓవరాల్ గా తొలిరోజు ‘కొబ్బరిమట్ట’ సినిమా రూ.60 లక్షలకు పైగా వసూళ్లు సాధించి దూసుకుపోతుంది. వీకెండ్ నాటికి సినిమా రెండు కోట్లు రాబట్టింది. లాంగ్ రన్ లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి!