Hi Nanna Movie: హాయ్ నాన్న నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. ఆకట్టుకుంటోన్న ‘సమయమా’ సాంగ్..

ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో వస్తోన్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాని జోడిగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ క్యూరియాసిటీని కలిగించాయి. ఓవైపు షూటింగ్ జరుగుతుండగా.. మరోవైపు ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సమయమా సాంగ్ ప్రోమో రిలీజ్ చేసి సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశారు.

Hi Nanna Movie: హాయ్ నాన్న నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. ఆకట్టుకుంటోన్న సమయమా సాంగ్..
Samayama Song

Updated on: Sep 16, 2023 | 1:32 PM

దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఈ మూవీలో పక్కా ఊరమాస్ పాత్రలో కనిపించి అదరగొట్టారు. ఇక ఇప్పుడు మరోసారి తండ్రి పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం హాయ్ నాన్న. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో వస్తోన్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాని జోడిగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ క్యూరియాసిటీని కలిగించాయి. ఓవైపు షూటింగ్ జరుగుతుండగా.. మరోవైపు ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సమయమా సాంగ్ ప్రోమో రిలీజ్ చేసి సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశారు.

తాజాగా ఈ మూవీ నుంచి సమయమా ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. సమయమా.. అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. హీరోహీరోయిన్స్ మధ్య సాగే ఒక మంచి రొమాంటిక్ లవ్ సాంగ్ అన్నట్లు తెలుస్తోంది. ఈ పాటను సింగర్ అనురాగ్ కులకర్ణి, సితార కృష్ణకుమార్ ఆలపించగా..మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు.

ఇటీవలే థియేటర్లలో సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్న ఖుషి చిత్రానికి హేశం అబ్దుల్ మ్యూజిక్ అందించి మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరోసారి తన మ్యూజిక్ తో మైమరపించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన సమయమా సాంగ్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.