Samantha: సమంత చేసిన మొదటి ఉద్యోగం ఏంటో తెలుసా ?.. నా ఫస్ట్ సాలరీ అంతే అంటూ క్లారిటీ ఇచ్చిన సామ్..

| Edited By: Ravi Kiran

Jul 06, 2022 | 6:38 PM

ఈ క్రమంలోనే ఇటీవల సమంత మొదటి జీతం గురించి ఓ నెటిజన్ ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పేసింది.

Samantha: సమంత చేసిన మొదటి ఉద్యోగం ఏంటో తెలుసా ?.. నా ఫస్ట్ సాలరీ అంతే అంటూ క్లారిటీ ఇచ్చిన సామ్..
Samantha (File Photo)
Follow us on

ఏమాయ చేసావే అంటూ తెలుగు చిత్రపరిశ్రమలోకి కథానాయికగా అరంగేంట్రం చేసింది సమంత (Samantha). మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా.. అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోస్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది సామ్. అక్కినేని నాగచైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం సామ్ తన కెరీర్ పై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. తెలుగుతోపాటు తమిళ్, హిందీలలోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం తెలుగులో యశోద, ఖుషి సినిమాల్లో నటిస్తున్న సమంత.. త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక నెట్టింట ఆమెకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. సామ్ చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఆమె లైఫ్ స్టైల్.. ఫుడ్, ఫ్యామిలీ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల సమంత మొదటి జీతం గురించి ఓ నెటిజన్ ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పేసింది.

తన మొదటి జీతం రూ. 500 అని చెప్పింది. ఒక హోటల్లో సమావేశానికి హోస్టెస్ గా దాదాపు ఎనిమిది గంటలు పనిచేశానని.. ఆ సమయంలో తనకు రూ. 500 ఇచ్చారని తెలిపిందే. ఈ ఘటన 10వ తరగతి లేదా 11వ తరగతిలో ఉన్నప్పుడు జరిగిందంటూ ఓ వీడియోలో చెప్పింది సామ్. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పుడు సామ్ అత్యధిక పారితోషికం తీసుకునే రెండవ హీరోయిన్ గా నిలిచింది. నివేదికల ప్రకారం సమంత ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రస్సో బ్రదర్స్, సిటాడెల్ చిత్రంతో సమంత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ చిత్రనిర్మాత ద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డికె దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటించనున్నాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.