Samantha: ‘బ్యూటీ అండ్ ది బీస్ట్.. యూఆర్ బోత్’.. గుర్రపు స్వారీ చేస్తోన్న సమంత.. ఫోటో వైరల్..

త్వరలోనే తాను ఖుషి చిత్రీకరణలో కూడా పాల్గొననున్నట్లు సామ్ ఆనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. అటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

Samantha: బ్యూటీ అండ్ ది బీస్ట్.. యూఆర్ బోత్.. గుర్రపు స్వారీ చేస్తోన్న సమంత.. ఫోటో వైరల్..
Samantha

Updated on: Feb 26, 2023 | 11:24 AM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే సినిమా చిత్రీకరణల్లో పాల్గొంటుంది. కొన్ని నెలలుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న ఆమె.. ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సమస్య నుంచి కాస్త కోలుకోవడంతో తిరిగి తన తదుపరి ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టింది. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ నటిస్తోన్న సిటాడెల్ సిరీస్ షూటింగ్ సెట్ లో జాయిన్ అయ్యింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ స్వయంగా ప్రకటించింది. ఈ క్రమంలో త్వరలోనే తాను ఖుషి చిత్రీకరణలో కూడా పాల్గొననున్నట్లు సామ్ ఆనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. అటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తున్న ఆమె.. తాజాగా ఆమె లెటేస్ట్ ఫోటో షేర్ చేసింది.

తన ఇన్ స్టా స్టోరీలో గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ..” ది బ్యూటీ అండ్ ది బీస్ట్.. యూఆర్ బోత్ ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. సమంత ఫోటోకు హీరోయిన్ రాశి ఖన్నా, ప్రగ్యా జైస్వాల్ స్పందిస్తూ.. లవ్ అండ్ ఫైర్ ఎమోజీలను జత చేశారు. చాలా రోజుల తర్వాత సామ్ ఇలా ఎనర్జీగా.. నవ్వుతూ కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. త్వరలోనే మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం సామ్ చేతిలో ఖుషి, సిటాడెల్ చిత్రాలున్నాయి. ఇందులో ఖుషి చిత్రంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తుండగా.. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సామ్ నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.