Shaakuntalam Trailer: అద్భుత దృశ్యకావ్యంగా శాకుంతలం.. ఆకట్టుకుంటున్న ట్రైలర్

ప్ర‌తి ఫ్రేమ్‌ను అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించే గుణ శేఖ‌ర్ మ‌రోసారి ‘శాకుంతలం’ వంటి విజువ‌ల్ వండ‌ర్‌తో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

Shaakuntalam Trailer: అద్భుత దృశ్యకావ్యంగా శాకుంతలం.. ఆకట్టుకుంటున్న ట్రైలర్
Shaakuntalam

Updated on: Apr 05, 2023 | 6:03 PM

సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న పిరియాడికల్ మూవీ శాకుంతలం. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణశేఖ‌ర్ రూపొందించిన పౌరాణిక ప్రేమ కావ్యం ‘శాకుంతలం’. ప్ర‌తి ఫ్రేమ్‌ను అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించే గుణ శేఖ‌ర్ మ‌రోసారి ‘శాకుంతలం’ వంటి విజువ‌ల్ వండ‌ర్‌తో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఈ సినిమా పై సామ్ చాలా నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా త్రీడీలోనూ రిలీజ్ కానుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రతి ఫ్రెమ్ ఎంతో అద్భుతంగా చూపించారు గుణశేఖర్. మరోసారి సమంత తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోనుందని అర్ధమవుతోంది. మలయాళీ యాక్టర్ దేవ్ మోహన్, డా.మోహన్ బాబు, సచిన్ కేడ్‌కర్, గౌతమి, మధుబాల, ప్రకాష్ రాజ్, కబీర్ బేడి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, వర్షిణి సౌందరరాజన్ వంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఏప్రిల్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆఫ్టర్ ఫ్యామిలీ మాన్2 సిరీస్‌లో తన స్టన్నింగ్ యాక్టింగ్ తరువాత..! మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ డిసీస్‌ తో సఫర్ అయ్యాక..! యశోదగా మన ముందుకు వచ్చారు సామ్. సెల్ఫ్‌ కాన్ఫిడెంట్‌తో .. సెల్ఫ్ మోటివేషన్‌తో.. మయోసైటిస్ అనే మాయరోజం నుంచి కొద్దిగా హీల్ ఆయ్యారు. మళ్లీ ఫిల్మ్ కెరీర్‌లో నిలదొక్కుకున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా సినిమా చేస్తున్నారు. అతి తొందర్లో విజయ్‌ దేవరకొండ ఖుషీ మూవీలో కూడా జాయిన్ అవుతానంటూ చెప్పి అందర్నీ ఖుషీ ఖుషీ చేశారు.