ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI) పుణ్యమా అని కొన్నిసార్లు చూడకూడదని వింతలన్నీ కూడా చూడాల్సి వస్తోంది. ఈ ఏఐ మంచి పనులకు ఉపయోగించాల్సింది పోయి.. కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. టెక్నాలజీ చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ సమంత బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మొదట ఈ ఫోటోలు చూసి ఆమె ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అయితే ఆ తర్వాత క్షుణ్ణంగా పరిశీలించగా అవి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో రూపొందించిన ఇమేజెస్ అని తేలింది. దీంతో వీటిని తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు మాయోసైటీస్ వ్యాధి బారిన పడిన సమంతా.. కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆమె ఇటీవల ‘సిటాడెల్: హనీ అండ్ బన్నీ’ వెబ్ సిరీస్‌తో రీ-ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. దీంతో పాటు సామ్ ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అప్‌డేట్ లేదు. ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సమంతా తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై వరుసగా అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.
ఇది చదవండి: సింగిల్స్ చూడాల్సిన మూవీ.. బోల్డ్ సీన్స్‌తో ఇండియాలో బ్యాన్.. కానీ ఓటీటీలో
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి