Shaakuntalam movie : గుణశేఖర్ శాకుంతలంకు దుశ్యంతుడు దొరికేసాడు.. ఆయన ఎవరోకాదు..
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో గుణశేఖర్ ఒకరు. ఒక్కడు సినిమాతో మహేష్ కెరియర్ లోనే బిగెస్ట్ హిట్ ను అందించారు. ఆతర్వాత గుణశేఖర్ నుంచి అలంటి సినిమా రాలేదు
Shaakuntalam : టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో గుణశేఖర్ ఒకరు. ఒక్కడు సినిమాతో మహేష్ కెరియర్ లోనే బిగెస్ట్ హిట్ ను అందించారు. ఆతర్వాత గుణశేఖర్ నుంచి అలంటి సినిమా రాలేదు. చాలా కాలం తర్వాత తిరిగి రుద్రమదేవి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు గుణశేఖర్. ప్రస్తుతం గుణశేఖర్ దగ్గుబాటి రానా హీరోగా హిరణ్య కశ్యప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతోపాటు సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం అనే సినిమాను కూడా చేస్తున్నారు గుణశేఖర్. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమా కోసం భారీ ఖర్చుతో సెట్స్ కూడా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే సమంతను శాకుంతల దేవిగా ఎంపిక చేసిన గుణశేఖర్ దుశ్యంతుడిగా ఎవరిని తీసుకుంటాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.
దీనిపై కొందరి పేర్లు వినిపించాయి. తెలుగులోనూ కొందరి పేర్లు అనుకున్నారు. ముఖ్యంగా సమంత లాంటి స్టార్ హీరోయిన్ పక్కన ఎవరైతే బాగుంటారని చాలా రోజులు చూసి ఇప్పుడు ఒకర్ని ఎంపిక చేశాడు దర్శకుడు గుణశేఖర్. ఈ సినిమా లో దుష్యంత్ పాత్రను మలయాళ యంగ్ స్టార్ దేవ్ మోహన్ తో చేయించబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. దుష్యంత్ గా దేవ్ మోహన్ నటించబోతున్నట్లుగా సమంత ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఈ సినిమా కోసం దాదాపు రూ.11 కోట్లతో సెట్ల నిర్మాణం జరుగుతుంది. ఈ సినిమాను సొంత బ్యానర్‌లోనే నిర్మిస్తున్నాడు గుణశేఖర్. పాన్ ఇండియన్ స్థాయిలో అత్యంత భారీగా సినిమాను నిర్మిస్తున్నాడు గుణశేఖర్. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
Here’s introducing our Prince Charming … DUSHYANT ?? @ActorDevMohanhttps://t.co/cqFNzAUsiI #Shaakuntalam @gunasekhar1 @neelima_guna @gunaateamworks
— Samantha Akkineni (@Samanthaprabhu2) March 6, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :
KGF STAR YASH: చిన్న పిల్లాడిలా అయిన కేజీఎఫ్ స్టార్ యశ్ వైరల్ అవుతున్న వీడియో…
‘పక్కా కమర్షియల్’ కోసం పక్కాప్లాన్ సిద్ధం చేస్తున్న మారుతి.. అక్టోబర్ టార్గెట్‌గా షూటింగ్..