Samantha: టాలీవుడ్ నెపోటిజం పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు.. సెలబ్రెటీ పిల్లలు ఫెయిల్ అయితే పరిస్థితి అదేనంటూ..

|

Jul 22, 2022 | 7:46 AM

నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నా సినిమాలు డిజాస్టర్ అయినా.. నేను ఫెయిల్ అయితే మా అమ్మ నాన్నలకు, సోదరులకు మాత్రమే తెలుస్తుంది. కానీ ఒక స్టార్ హీరో పిల్లలు ఫెయిల్ అయితే దేశం

Samantha: టాలీవుడ్ నెపోటిజం పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు.. సెలబ్రెటీ పిల్లలు ఫెయిల్ అయితే పరిస్థితి అదేనంటూ..
Sam
Follow us on

కాఫీ విత్ కరణ్ 7 షోలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha).. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‏తో కలిసి సందడి చేసింది. పుష్ప చిత్రంలో సామ్ నటించిన స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావ.. ఊహు అంటావా పాటకు అక్షయ్‏తో కలిసి స్టెప్పులేసింది. ఇక వీరిద్దరికి సంబంధించిన ఎపిసోడ్ గురువారం రాత్రి ప్రసారమయ్యింది. ఇందులో సామ్ తన వ్యక్తిగత జీవితం.. కెరీర్.. పెళ్లి.. విడాకుల పై స్పందించింది. అలాగే టాలీవుడ్ నెపోటిజం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తెలుగు చిత్రపరిశ్రమలో చాలా మంది హీరోస్ తమ పిల్లలు, బంధువులు మాత్రమే హీరోలు అవుతారని.. విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తులు స్టార్ గా మారడం చాలా అరుదు అని అన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘బిగ్ బాయ్స్ క్లబ్’ నెపోటిజం పై మీ ఆలోచన ఏంటీ ? అని కరణ్ అడిగారు.

సమంత మాట్లాడుతూ.. ” నాకు తెలిసి ఆపిల్ నుంచి మరో ఆపిల్ కు భిన్నంగా ఉంటుందని అనుకుంటున్నాను. నేపో పిల్లలు.. నాన్ నెపో పిల్లలు. ప్రతి ఒక్కరు తమ సొంత ఆలోచనలు.. ప్రతిభ కలిగి ఉంటారు. వారికి కూడా సొంతంగా టాలెంట్ ఉంటుంది. ఒక తండ్రి కోచ్‏గా ఉన్నప్పుడు అతని కుమారుడు గేమ్ ఆడుతున్న సమయంలో అతను పక్కన నిలబడతాడు. అంతేకానీ గేమ్ గెలవాడానికి అతను ఏం చేయలేడు.

ఇవి కూడా చదవండి

నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నా సినిమాలు డిజాస్టర్ అయినా.. నేను ఫెయిల్ అయితే మా అమ్మ నాన్నలకు, సోదరులకు మాత్రమే తెలుస్తుంది. కానీ ఒక స్టార్ హీరో పిల్లలు ఫెయిల్ అయితే దేశం మొత్తం తెలిసిపోతుంది. వారిని ఎప్పుడూ ట్రోల్ చేస్తారు. వారసత్వంతో పోలుస్తారు. సూపర్ స్టార్స్ అందరూ గొప్ప నటులని.. గొప్ప నటులందరూ సూపర్ స్టార్స్ అని తాను అనుకోవడం లేదని. దైవానుగ్రహంతోపాటు అదృష్టం కూడా ఉండాలి. మన సక్సెస్ నిర్ణయించేది ప్రేక్షకులే ” అంటూ చెప్పుకొచ్చింది.