Samantha: బాలీవుడ్ స్టార్ హీరోపై సమంత షాకింగ్ కామెంట్స్.. మీ ప్రవర్తనలో మార్పెంటీ అంటూ..

|

Jan 12, 2022 | 10:25 AM

సమంత ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది.. ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీలో స్పెషల్‏ సాంగ్‏లో

Samantha: బాలీవుడ్ స్టార్ హీరోపై సమంత షాకింగ్ కామెంట్స్.. మీ ప్రవర్తనలో మార్పెంటీ అంటూ..
Samantha
Follow us on

సమంత ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది.. ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీలో స్పెషల్‏ సాంగ్‏లో కనిపించి అదరగొట్టింది సామ్. విడాకుల తర్వాత సమంత తన కెరీర్ పై దృష్టి పెట్టింది. టాలీవుడ్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలలో పగా వేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పై సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది. కానీ ఆ వ్యాఖ్యలు సీరియస్ గా కాదండోయ్.. ఫన్నీగా చేసినవే. సమంత, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కలిసి ఓ యాడ్ చేశారు. ఆ వీడియోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ అక్షయ్ కుమార్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

సదరు యాడ్‏లో అక్షయ్ కుమార్ దొంగలా నటించారు. సమంత ఉంటున్న ఇంట్లోకి దొంగగా వచ్చిన అక్షయ్.. అక్కడ ఉన్న ఫుడ్ ఐటెం చూసి అక్కడే ఉండిపోతారు. ఇంతలో పోలీసులకు ఫోన్ చేసి పట్టించేస్తుంది సమంత. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గా నటించిన మీరు.. ఇలా దొంగగా మారిపోతారా ? మీ ప్రవర్తనలో ఈ మార్పేంటి ? అంటూ కామెంట్ చేస్తూ అక్షయ్ ను ట్యాగ్ చేసింది. సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత ప్రస్తుతం యశోద సినిమాలో నటించిస్తుంది. ఇప్పుటికే షూటింగ్ పూర్తిచేసుకున్న శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ట్వీట్..

Also Read: Hero Siddharth: సైనాపై నేను చేసింది జోక్ మాత్రమే ఆమె గొప్ప క్రీడాకారిణి అంటూ.. బహిరంగంగా క్షమాపణ చెప్పిన హీరో సిద్ధార్ద్..

Anupama Parameswaran : ఏంటమ్మా అనుపమ ఇంతపని చేశావ్.. బరువెక్కిన గుండెతో ఫ్యాన్స్ కామెంట్స్..

Ravi Teja’s Ravanasura: రవితేజ సినిమాకోసం రంగంలో అక్కినేని యంగ్ హీరో.. న్యూ లుక్ మాములుగా లేదుగా..