సమంత ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది (Samantha). ఇటీవల పుష్ప సినిమాలోని స్పెషల్ సాంగ్తో ఓ ఊపు ఊపేసిన సామ్.. ఇప్పుడు వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. సామ్ నటించిన శాకుంతలం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమవుతుండగా.. మరోవైపు యశోద సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది సామ్. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు నెట్టింట్లో షేర్ చేస్తుంటుంది. తన దగ్గర ఉండే పెట్స్ అంటే సమంతకు ఎంత ఇష్టమో తెలిసిన విషయమే. వాటి గురించి ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా వాటితో దిగిన ఫోటోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.. అయితే అది చూసిన ఓ నెటిజన్ సామ్ పై షాకింగ్ కామెంట్ చేశారు..
” తన పెట్ కుక్కలు, పిల్లులతోనే ఆమె ఒంటరిగా చనిపోవాలి” అంటూ కామెంట్ చేసాడు. ఇక ఇది చూసిన సమంత అతని కామెంట్ పై తనదైన శైలీలో స్పందించింది. అదే జరిగితే నన్ను నేను అదృష్టవంతురాలిగా భావిస్తాను అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం సామ్ చేసిన ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన సమంత ఫ్యాన్స్ సదరు నెటిజన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు… దీంతో అతడు తన కామెంట్ చేశాడు.. కానీ నెటిజన్ కామెంట్ ను స్క్రీన్ షాట్ తీసి మరి వైరల్ చేస్తున్నారు.