ఇంటి టెర్రస్‌పై కూర‌గాయ‌లు పండిస్తోన్న స‌మంత‌..

మంత తన వెజిటబుల్‌ గార్డన్‌ను ఫ్యాన్స్ కు పరిచయం చేసింది. అర్బన్‌ కిసాన్‌ వారితో కలిసి తన ఇంటి టెర్రస్‌ మీద వెజిటబుల్స్ పండిస్తోంది.

ఇంటి టెర్రస్‌పై కూర‌గాయ‌లు పండిస్తోన్న స‌మంత‌..

Updated on: Jun 02, 2020 | 3:05 PM

స‌మంత అక్కినేని..పెళ్లి త‌ర్వాత కూడా వ‌ర‌స సినిమాల‌తో జోరు చూపిస్తోంది. ఫ్యామిలీని, సినిమాల‌ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతోంది. ప్ర‌స్తుతం క‌రోనా లాక్‌డౌన్‌లో కుటుంబంతో విలువైన స‌మాయాన్ని గడుపుతోంది. గ‌తంలో సోష‌ల్ మీడియాలో య‌మ యాక్టీవ్ గా ఉండే స‌మంత‌..రీసెంట్ టైమ్స్ లో ఎందుకో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేసింది. తాజాగా మ‌రోసారి యాక్టీవ్ అయ్యింది. వ‌రుస పోస్టుల‌తో అభిమానుల‌తో త‌న అప్ డేట్స్ పంచుకుంటుంది. ఇటీవ‌ల‌ తన పెట్‌తో గడిపిన ఫొటోలతో పాటు..భ‌ర్త నాగ చైతన్య‌తో కలిసి దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది.

తాజ‌గా సమంత తన వెజిటబుల్‌ గార్డన్‌ను ఫ్యాన్స్ కు పరిచయం చేసింది. అర్బన్‌ కిసాన్‌ వారితో కలిసి తన ఇంటి టెర్రస్‌ మీద వెజిటబుల్స్ పండిస్తోంది. కూరగాయలను మనమే ఎలాంటి కెమికల్స్ వాడ‌కుండా‌ ఆర్గానిక్‌ పద్ధతిలో సాగు చేసుకుంటే ఎటువంటి వ్యాధులు రావు. అందుకని లాక్‌డౌన్‌లో సమంత ఆర్గానిక్‌ పద్ధతిలో కూర‌గాయ‌లు‌ పండించడం నేర్చుకుంది.