
‘సామజవరగమన’ ఇటీవల వచ్చి డీసెంట్ హిట్ అయ్యింది. సాలిడ్ కలెక్షన్స్ సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా అటు ప్రేక్షుకులతో పాటు ఇండస్ట్రీ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఫస్ట్ వీక్‌లో వరల్డ్ వైడ్ ఈ చిత్రం రూ. 30.1 కోట్లు వసూలు చేసినట్లు మూవీ యూనిట్ తెలిపింది. ముఖ్యంగా హీరో శ్రీవిష్ణుకి ఇది కెరీర్‌లో బిగ్ హిట్. మంచి కథకు.. పసందైన వినోదం జోడించిన దర్శకుడు రామ్ అబ్బరాజును సీనియర్ దర్శకులు, నటీనటులు ప్రశంసిస్తున్నారు. రవితేజ, అల్లు అర్జున్ వంటి నటుడు సినిమా అద్భుతం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం కూడా ఉందండోయ్. డైరెక్టర్ రామ్ అబ్బరాజు ‘సామజవరగమన’ స్టోరీని తొలుత చెప్పింది శ్రీవిష్ణుకి కాదట. రామ్ అబ్బరాజు వివాహ భోజనంబు అని కమెడియన్ సత్యతో ఓ మూవీ చేశాడు. ఆ మూవీని సందీప్ కిషన్ ప్రొడ్యూస్ చేశాడు. ఆ కృతఘ్నతతో సందీప్ కోసం ఈ ఐడియా అనుకని డెవలప్ చేశాడట రామ్ అబ్బరాజు. కానీ అప్పటికే మైఖేల్ మూవీతో సందీప్ బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌లోకి శ్రీవిష్ణు ఎంటరయ్యాడు. అలా సందీప్‌కు ఓ బ్లాక్ బాస్టర్ సినిమా మిస్సయ్యింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..