ఆ హీరోయిన్ ముద్దుని శానిటైజ్ చేయాలంటోన్న స‌ల్లూ భాయ్..ట్వీట్ చూశారా..

ఆ హీరోయిన్ ముద్దుని శానిటైజ్ చేయాలంటోన్న స‌ల్లూ భాయ్..ట్వీట్ చూశారా..

లాక్ డౌన్ వేళ ఇంట్లోనే ఉన్న‌ సెలబ్రిటీలంతా సోష‌ల్ మీడియాలో య‌మ యాక్టీవ్ గా ఉంటున్నారు. లైవ్ చాట్స్ లో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటూ ఎవ‌రికీ తెలియ‌ని విష‌యాల‌ను పంచుకుంటున్నారు. తాజాగా క్వారంటైన్‌లో ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ క్రేజీ వీడియోను అభిమానుల‌తో పంచుకున్నాడు. అందులో మైనే ప్యార్ కియా మూవీలోని ఓ సీన్ ని.. ప్ర‌జంట్ సిట్యువేష‌న్స్ కి అనుగుణంగా మరో సినిమా సీన్‌లో సరిపోల్చాడు. అందులో అద్దంపై హీరోయిన్ […]

Ram Naramaneni

|

Apr 13, 2020 | 2:56 PM

లాక్ డౌన్ వేళ ఇంట్లోనే ఉన్న‌ సెలబ్రిటీలంతా సోష‌ల్ మీడియాలో య‌మ యాక్టీవ్ గా ఉంటున్నారు. లైవ్ చాట్స్ లో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటూ ఎవ‌రికీ తెలియ‌ని విష‌యాల‌ను పంచుకుంటున్నారు. తాజాగా క్వారంటైన్‌లో ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ క్రేజీ వీడియోను అభిమానుల‌తో పంచుకున్నాడు. అందులో మైనే ప్యార్ కియా మూవీలోని ఓ సీన్ ని.. ప్ర‌జంట్ సిట్యువేష‌న్స్ కి అనుగుణంగా మరో సినిమా సీన్‌లో సరిపోల్చాడు. అందులో అద్దంపై హీరోయిన్ కిస్ పెట్టిన‌ పెదాల ముద్ర ఉంటుంది. అప్పటి సినిమాలో హీరోగా ఉన్న సల్మాన్ ఖాన్… అదే ప్లేస్‌లో హీరోయిన్‌ను తలుచుకుంటూ ఆ ముద్ర‌పై ముద్దు పెడతాడు.

అదే ప్ర‌జంట్ ఉన్న పరిస్థితుల్లో అయితే హీరో అలా అద్దాలపై ఉన్న హీరోయిన్ కిస్ చేసిన‌ ముద్రను సానిటైజ్ చేసేస్తాడు. లాక్ డైన్ లో ఉన్న‌ప్పుడు భౌతిక‌ దూరం పాటించాలని అంద‌రూ ప‌దే, ప‌దే చెప్తోన్న విష‌యం తెలిసిందే. ఆ విష‌యాన్ని సినిమాటిక్ వేలో చెప్పేందుకు సల్మాన్ ఈ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఇప్పుడు మైనే ప్యార్ కియా మూవీ వస్తే… పరిస్థితి ఇలా ఉంటుంది అంటూ ఆ ట్వీట్‌కు సల్మాన్ క్యాప్షన్ కూడా పెట్టాడు. అంతే కాదు హ్యాపీ ఈస్టర్ అంటూ శుభాకాంక్ష‌లు కూడా చెప్పాడు. స్టే ఫోకస్సడ్ స్టే హోమ్ అని మెసేజ్ ఇచ్చాడు స‌ల్లూ భాయ్.

1989లో సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ జంటగా విడుద‌లైన‌ ‘మైనే ప్యార్ కియా’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో కూడా ‘ప్రేమ పావురాలు’ పేరుతో మూవీని రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమా సాంగ్స్ ఆల్ టైమ్ హిట్స్ గా నిలిచాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu