
సికందర్’ సినిమా విడుదలైన రోజే నటుడు సల్మాన్ ఖాన్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఆదివారం (మార్చి 30) దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదైంది. కానీ ‘సికందర్’ చిత్రం విడుదలకు ఒక రోజు ముందు శనివారం ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఎ. ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వివిధ పైరేటెడ్ సైట్లలో దర్శనమిస్తోంది. ‘తమిళ్ రాకర్స్’, ‘మూవీ రూల్స్’, ‘ఫిల్మిజిల్లా’ తో పాు వివిధ టెలిగ్రామ్ గ్రూపులలో మొత్తం సినిమా HD లో లీక్ అయినట్లు సమాచారం. ఈ పైరసీ సైట్‌లు చట్టవిరుద్ధంగా సినిమాలను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవసరమైన లింక్‌లను అందిస్తున్నాయి. పైరసీ నిరోధక చట్టాలు, అక్రమ స్ట్రీమింగ్ సైట్‌లపై కఠిన చర్యలు ఉన్నప్పటికీ, పైరసీ (చట్టవిరుద్ధంగా సినిమాలను ఆన్‌లైన్‌లో లీక్ చేయడం) బాలీవుడ్‌కు పెద్ద సమస్యగా మారింది. ‘సికందర్’ చిత్రం థియేటర్లలోని క్యామ్‌కార్డర్ రికార్డింగ్ నుంచి లీక్ అయి ఉండవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. క్యామ్‌కార్డర్ రికార్డింగ్‌ల నుంచి సినిమాలు వేగంగా HD క్వాలిటీకి అప్‌గ్రేడ్ అవుతాయి.ఆ తర్వాత గంటల్లోనే పైరేటెడ్ సైట్స్ లలో అప్‌లోడ్ అవుతాయి.
సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న నటించిన ‘సికందర్’ చిత్రం ‘తమిళ్ రాకర్స్’, ‘మూవీ రూల్జ్’, ‘టెలిగ్రామ్’ తో పాటు ఇతర టొరెంట్ వెబ్‌సైట్లలో లీక్ అయింది. గతంలో, ‘పుష్ప 2: ది రూల్’, ‘చావా’, ‘స్త్రీ 2’, ‘కల్కి 2898 AD’, ‘సింఘం ఎగైన్’, ‘భూల్ భూలయా 3’, ‘దేవారా’, ‘పఠాన్’, ‘జవాన్’, ‘గదర్ 2’, ‘యానిమల్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు కూడా ఆన్‌లైన్ పైరసీ బారిన పడ్డాయి.
ఈ విషయంలో ప్రముఖ సినీ క్రిటిక్, ట్రేడ్ నిపుణులు కోమల్ నహ్తా తన X (ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ రాశారు. ‘సికందర్’ లీక్ కావడం సల్మాన్ కు పెద్ద దెబ్బ అని ఆయన అన్నారు. “ఇది ఏ నిర్మాతకైనా చాలా చెడ్డ విషయం.” ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకముందే ఆన్‌లైన్‌లో లీక్ అయింది. దురదృష్టవశాత్తు, సాజిద్ నదియాద్వాలా చిత్రం సికందర్ విషయంలో కూడా ఇది జరిగింది. నిన్న రాత్రి, నిర్మాతలు 600 ప్రదేశాల నుంచి సినిమాను తొలగించాలని అధికారులను కోరారు. కానీ ఇప్పటికీ, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పైరసీ రకం పెరుగుతోంది. “ఇది సల్మాన్ చిత్ర నిర్మాతలకు పెద్ద దెబ్బ కావచ్చు” అని ఆయన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
It’s the worst nightmare for any producer. A film being leaked before its theatrical release. Unfortunately, that’s what happened last evening to Sajid Nadiadwala’s ‘Sikandar’, slated to release today in cinemas. The producer had the authorities pull the film down from 600 sites… pic.twitter.com/mRA8T4qG23
— Komal Nahta (@KomalNahta) March 30, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.