Salman Khan : కశ్మీర్ నరకంగా మారుతుంది.. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా..

పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని సినీతారలు ఖండిస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ సినీప్రముఖులు స్పందించారు. తాజాగా బీటౌన్ స్టార్ సల్మాన్ ఖాన్ సైతం రియాక్ట్ అయ్యారు. ఒకప్పుడు భూతల స్వర్గంలా ఉన్న కశ్మీర్ ఇప్పుడు నరకంగా మారుతోందని అన్నారు. ఈ ఘటనపై తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Salman Khan : కశ్మీర్ నరకంగా మారుతుంది.. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా..
Salman Khan, Priyanka Chopr

Updated on: Apr 23, 2025 | 9:32 PM

జమ్మూ కశ్మీర్‏లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని కలవరపరిచింది. ఈ ఘటనలో అమాయకులైన పర్యాటకులు 27 మంది మరణించారు. భూలోక స్వర్గం లాంటి కాశ్మీర్‌ను చూడటానికి వెళ్లిన పర్యాటకులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. అప్పటివరకు పర్యాటకులతో ఆహ్లాదంగా కనిపించిన ఆ అందమైన ప్రాంతం ఒక్కసారిగా భీకరంగా మారిపోయింది. తమ ఆత్మీయులను కోల్పోయి చాలా మంది తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ ఉగ్రదాడి ఘటనపై సినీతారలు స్పందిస్తున్నారు. ఈ ఘటనపై అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి తారలు స్పందించగా.. తాజాగా సల్మాన్ ఖాన్ తన సంతాపాన్ని వ్యక్తం చేసారు.

“‘కశ్మీర్ భూమిపై స్వర్గం లాంటిది. కానీ ఇప్పుడు అది నరకంగా మారుతుంది. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారు. చనిపోయిన వారి కుటుంబాల కోసం నా హృదయం తల్లడిల్లుతుంది. ఒక అమాయకుడిని చంపడం అంటే మొత్తం ప్రపంచాన్ని చంపినట్లే ” అంటూ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకోచ్చారు సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ మాత్రమే కాదు, షారుక్ ఖాన్, కియారా అద్వానీ, యష్, అనుపమ్ ఖేర్, కంగనా రనౌత్, రష్మిక మందన్న, అనుష్క శర్మ సైతం సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. తాజాగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సైతం స్పందించింది.

ప్రియాంక చోప్రా తన ఇన్ స్టాలో “పహల్గామ్ దాడి వార్త విని చాలా బాధపడ్డాను. ఇది అత్యంత నీచమైన చర్య” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఐక్యరాజ్యసమితి బాలల నిధి (UNICEF)కి గ్లోబల్ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి :  

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..

OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..