బాక్సాఫీస్ దగ్గర మరో ఇంట్రెస్టింగ్ ఫైట్‌కు రంగం సిద్ధమవుతుంది. నువ్వా నేనా అంటూ కొదమ సింహాల్లా కొట్టుకోవడానికి ఇటు ప్రభాస్, అటు షారుక్ ఇద్దరూ రెడీ అవుతున్నారు. నెక్స్ట్ 1000 కోట్లు ఎవరు తీసుకొస్తారో చూద్దామంటూ సవాల్ చేసుకుంటున్నారు. మరి ఈ రేసులో ప్రస్తుతానికి ఎవరు ముందున్నారు..? సెప్టెంబర్ బిగ్ ఫైట్‌పై స్పెషల్ స్టోరీ..
ఇటు ప్రభాస్.. అటు షారుక్.. ఇద్దరూ మంచి ఊపు మీద ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్నా కూడా.. ఆయన సినిమా వచ్చిందంటే వందల కోట్ల ఓపెనింగ్ వస్తుంది. నెగిటివ్ టాక్ తోనే ఆదిపురుష్ 400 కోట్లకు పైగా వసూలు చేసిన సంగతి మర్చిపోకూడదు. అలాంటిదిప్పుడు సలార్ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. టాక్ పాజిటివ్ వస్తే.. కలెక్షన్లు 1000 కోట్లు ఖాయం. ప్రశాంత్ నీల్ కూడా ఉండడంతో సలార్ సినిమా రేంజ్ మరింత పెరిగింది. సెప్టెంబర్ 28న విడుదల కానున్న ఈ సినిమాకు బాలీవుడ్‌లోనూ బిజినెస్ భారీగా జరుగుతుంది. బాహుబలి 2 అక్కడ 500 కోట్లకు పైగా వసూలు చేస్తే.. సాహో, ఆదిపురుష్ కూడా దాదాపు 150 కోట్లు వసూలు చేశాయి. దాంతో సలార్ ఓపెనింగ్స్ కూడా భారీగా వస్తాయనే నమ్ముతున్నారు మేకర్స్. ఇక యుఎస్‌లోనూ రప్ఫాడిస్తుంది సలార్.
THE MOST VIOLENT MEN… CALLED ONE MAN… THE MOST VIOLENT 🔥
Presenting our next feature #SalaarCeaseFire to the world: https://t.co/AhH86b1cQS#SalaarTeaser #Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms #VijayKiragandur @IamJagguBhai… pic.twitter.com/Jrvr7jK3zL
— Salaar (@SalaarTheSaga) July 5, 2023
మరోవైపు పఠాన్ సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన షారుక్.. జవాన్‌తో అదే ఊపు కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. ఈ చిత్ర బిజినెస్ దాదాపు 400 కోట్ల వరకు జరుగుతుంది. సెప్టెంబర్ 7న ఈ సినిమా విడుదల కానుంది. సలార్, జవాన్ 3 వారాల గ్యాప్‌లో రానున్నాయి. నేరుగా పోటా పోటీ ఉండకపోవచ్చు.. కానీ రికార్డుల పరంగా ఖచ్చితంగా పోటీ ఉంటుంది. జవాన్‌కు కూడా పాజిటివ్ టాక్ వచ్చినా 1000 కోట్లు కొట్టడం ఖాయం.
యూఎస్‌లో ఇటు సలార్.. అటు జవాన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. నెల రోజుల ముందుగానే సలార్ దూకుడు కనిపిస్తుందక్కడ.. జవాన్ విడుదలకు మరో 2 వారాలే ఉన్నా రేసులో షారుక్ కంటే ముందున్నారు ప్రభాస్. ఈ విషయంలో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒక టాలీవుడ్ హీరో బాలీవుడ్‌లో ఈ రేంజ్ ఆధిపత్యం చెలాయించడం ఇదే ఫస్ట్ టైమ్. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. మొత్తానికి చూడాలి.. రేపు బాక్సాఫీస్ దగ్గర సలార్, జవాన్ దండయాత్ర ఎలా ఉండబోతుందో.
Main kaun hoon, kaun nahin, jaanne ke liye, READY AH?
#JawanPrevue Out Now!
#Jawan releasing worldwide on 7th September 2023, in Hindi, Tamil & Telugu. https://t.co/6uL1EsSpBw— Shah Rukh Khan (@iamsrk) July 10, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.