AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayantara: అయ్య బాబోయ్.. నయనతారను జిరాక్స్ తీసినట్టు మరో యువతి.. వీడియో చూస్తే..

దివంగత హీరోయిన్ సౌందర్య పోలికలతో ఉన్న అమ్మాయి నెట్టింట తెగ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అలాగే దివంగత నటి సిల్క్ స్మిత పోలికలతో ఉన్న అమ్మాయి కూడా సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయ్యింది. ఇక ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ నయనతారను జిరాక్స్ తీసినట్లుగా నెట్టింట ఓ అమ్మాయి వీడియో తెగ హల్చల్ చేస్తున్నాయి. అచ్చుగుద్దినట్లు నయన్ పోలికలతో ఉన్న ఆ అమ్మాయిని చూసి షాకవుతున్నారు ప్యాన్స్.

Nayantara: అయ్య బాబోయ్.. నయనతారను జిరాక్స్ తీసినట్టు మరో యువతి.. వీడియో చూస్తే..
Nayanthara
Rajitha Chanti
|

Updated on: Apr 28, 2024 | 6:52 PM

Share

సాధారణంగా మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన పెద్దలు చెబుతుంటారు. ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఒకేవిధమైన పోలికలు ఉన్న వ్యక్తులు ఉంటారు. అయితే వీరంతా ఎక్కడున్నారు అనే విషయం తెలుసుకోవడం కష్టమే. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా టెక్నాలజీలో మనుషులను పోలిన మనుషులను గుర్తుపట్టడం చాలా తేలికైపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది రీల్స్, ఫోటోస్ షేర్ చేస్తున్నారు. అలా ఓకే విధమైన పోలికలు ఉన్నవారు సులభంగా కలిసిపోతున్నారు. ఇప్పటికే దివంగత హీరోయిన్ సౌందర్య పోలికలతో ఉన్న అమ్మాయి నెట్టింట తెగ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అలాగే దివంగత నటి సిల్క్ స్మిత పోలికలతో ఉన్న అమ్మాయి కూడా సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయ్యింది. ఇక ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ నయనతారను జిరాక్స్ తీసినట్లుగా నెట్టింట ఓ అమ్మాయి వీడియో తెగ హల్చల్ చేస్తున్నాయి. అచ్చుగుద్దినట్లు నయన్ పోలికలతో ఉన్న ఆ అమ్మాయిని చూసి షాకవుతున్నారు ప్యాన్స్.

అచ్చం నయనతారలాగే ఉన్న ఆ అమ్మాయి పేరు సజినీకృష్ణ. ఇటీవల ఈ అమ్మాయి వీడియోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఒడిపోలమా సినిమాలోని ఓ పాటకు లిప్ సింగ్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. అందులో స్మోకీ మేకప్ లుక్ తో సాంప్రదాయ దుస్తులను ధరించి కనిపించింది. ఇక పాటకు తగినట్లుగా ఆ అమ్మాయి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ మాత్రం పూర్తిగా నయనతారను గుర్తుచేస్తున్నాయి. సజినికృష్ణ వీడియోస్ అన్నింటిలోనూ అచ్చం నయన్ లా కనిపిస్తుంది. దీంతో ఆమె నయనతార చెల్లిలగా ఉందని.. అచ్చం నయనతారను చూస్తున్నట్లుగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో నయనతార ఒకరు. తెలుగు, మలయాళం, తమిళం భాషలలో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇటీవలే జవాన్ సినిమాతో హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సరసన నటించి అలరించింది. చివరిసారిగా నయన్ అన్నపూర్ణి చిత్రంలో కనిపించింది. అలాగే డియర్ స్టూడెంట్స్, పట్టు, విక్కీ 6, టెస్ట్, థని ఒరువన్ 2 వంటి చిత్రాల్లో నటించనుంది నయన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!
కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..
కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..
ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్
ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?
ఏసీ కూలింగ్ ఎక్కువ రావడం లేదా.. ఈ చిన్న వాటర్ ట్రిక్ ట్రై చేయండి
ఏసీ కూలింగ్ ఎక్కువ రావడం లేదా.. ఈ చిన్న వాటర్ ట్రిక్ ట్రై చేయండి
కెమికల్స్ కలిపిన టమాటాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసా..?
కెమికల్స్ కలిపిన టమాటాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసా..?
9 సీట్ల వాహనంలో 40 మంది ప్రయాణం.. షాకైన జనాలు..నెట్టింట్లో వైరల్‌
9 సీట్ల వాహనంలో 40 మంది ప్రయాణం.. షాకైన జనాలు..నెట్టింట్లో వైరల్‌