Sairam Shankar : డైనమిక్ డైరెక్టర్ పూరీజగనాద్ తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన హీరో సాయిరాం శంకర్. హీరోగా చేయక ముందు ఈ కుర్రహీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో హీరో ఫ్రెండ్ గా నటించిన ఆకట్టుకున్నాడు. ఇక బంపర్ ఆఫర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు సాయిరాం. ‘బంపర్ ఆఫర్’ సినిమా తర్వాత సరైన సక్సెస్ అందుకోలేకపోయిన సాయిరామ్.. ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకొని బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో వస్తున్నాడు.ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా సాయిరాం నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.
అయితే చాలారోజులతర్వాత మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నారు సాయి. దాదాపు 12 ఏళ్ల తర్వాత బంపర్ ఆఫర్ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారని ఈ మధ్య వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా పట్టాలెక్కిస్తున్నాడు సాయిరాం. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తాజాగా మరో సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. ప్రముఖ మలయాళ దర్శకుడు వినోద్ విజయన్ తో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘అడ్వకేట్ సిద్ధార్థ్ నీలకంఠ’ పాత్రలో కనిపించనున్నాడు సాయి. తెలుగు తమిళ కన్నడ భాషల్లో రూపొందిస్తున్నారు. శృతి సోధి – ఆషిమా నర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీకి ‘ఉత్కంఠ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :