సైఫ్​ ఆటో బయోగ్రఫీ, బాలీవుడ్‌లో న‌యా ట్రెండ్

బాలీవుడ్‌​ సెల‌బ్రిటీలు త‌మ జీవిత చరిత్రలను స్వ‌యంగా రాసుకుంటున్నారు. ఇటీవ‌లి కాలంలో ఈ ట్రెండ్ అక్క‌డ బాగా పెరిగింది. హాట్ బ్యూటి ప్రియాంకా చోప్రా తన లైఫ్‌లోని కొన్ని సంఘటనలతో ‘అన్​ఫినిష్డ్’​ పేరిట ఓ పుస్తకాన్ని తీసురాబోతున్న‌ట్లు చెప్పింది. తాజాగా సైఫ్​ అలీఖాన్​ ఈ లిస్ట్‌లో చేరారు. తన ఆటో బయోగ్రఫీని రాయనున్నట్లు అఫిషియ‌ల్‌గా అనౌన్స్ చేశాడు. తన ప‌ర్స‌న‌ల్ లైఫ్‌తో పాటు సినిమా విశేషాలు, కెరీర్​లోని ఎత్తుపల్లాలు, జీవితంలో త‌నను ముందుకు తీసుకెళ్లిన వ్య‌క్తుల‌ గురించి […]

సైఫ్​ ఆటో బయోగ్రఫీ, బాలీవుడ్‌లో న‌యా ట్రెండ్

Updated on: Aug 25, 2020 | 1:31 PM

బాలీవుడ్‌​ సెల‌బ్రిటీలు త‌మ జీవిత చరిత్రలను స్వ‌యంగా రాసుకుంటున్నారు. ఇటీవ‌లి కాలంలో ఈ ట్రెండ్ అక్క‌డ బాగా పెరిగింది. హాట్ బ్యూటి ప్రియాంకా చోప్రా తన లైఫ్‌లోని కొన్ని సంఘటనలతో ‘అన్​ఫినిష్డ్’​ పేరిట ఓ పుస్తకాన్ని తీసురాబోతున్న‌ట్లు చెప్పింది. తాజాగా సైఫ్​ అలీఖాన్​ ఈ లిస్ట్‌లో చేరారు. తన ఆటో బయోగ్రఫీని రాయనున్నట్లు అఫిషియ‌ల్‌గా అనౌన్స్ చేశాడు.

తన ప‌ర్స‌న‌ల్ లైఫ్‌తో పాటు సినిమా విశేషాలు, కెరీర్​లోని ఎత్తుపల్లాలు, జీవితంలో త‌నను ముందుకు తీసుకెళ్లిన వ్య‌క్తుల‌ గురించి ఇందులో వివ‌రించ‌నున్న‌ట్లు చెప్పారు. హార్పర్​ కోలిన్స్​ సంస్థ ప్రచురించనున్న ఈ పుస్తకం.. 2021లో రిలీజ్ కానుంది.

మ‌రోవైపు బాహుబ‌లి ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలో సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా కనిపించనున్నారని టాక్ న‌డుస్తోంది. చెడుపై మంచిదే విజయం అనే థీమ్‌తో డైరెక్ట‌ర్‌ ‘ఓం రౌత్’ ఈ సినిమా తీస్తున్నారు. అయితే ‘ఓం రౌత్’​ తెరకెక్కించిన ‘తానాజీ’లో సైఫ్​ కీలక పాత్రలో న‌టించారు. అందుకే ఈ వార్త‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరుతుంది.

Also Read :

సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కార్ : రేష‌న్ బియ్యం వ‌ద్దంటే డ‌బ్బు!

ప‌బ్‌జీ పెట్టిన చిచ్చు : తుపాకులు, లాఠీల‌తో రెండు కుటుంబాల ఘ‌ర్ష‌ణ‌