Devara : దేవరను ఢీ కొట్టే భైరా.. అదరగొట్టిన సైఫ్ అలీఖాన్ వీడియో..

|

Aug 17, 2024 | 1:33 PM

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తున్నారు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. భారీ స్టార్ కాస్ట్ ఉన్న ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Devara : దేవరను ఢీ కొట్టే భైరా.. అదరగొట్టిన సైఫ్ అలీఖాన్ వీడియో..
Devara
Follow us on

యంగ్ ఎన్టీఆర్ నటిస్తున్న నయా మూవీ ‘దేవర’. ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దేవర సినిమా విడుదల కోసం ఎన్టీఆర్ అభిమానులతో పాటు.. ప్రేక్షకులందరూ ఈగర్ గ ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తున్నారు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. భారీ స్టార్ కాస్ట్ ఉన్న ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసం విదేశీ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ఇప్పటివరకూ విడుదలైన అప్ డేట్స్‌లో ఈ సినిమాలో విలన్ క్యారెక్ట ర్ టీజర్ విడుదలైంది.

ఇది కూడా చదవండి : Bigg Boss 8: బాబోయ్.. ఇది కదా కిక్ అంటే..! బిగ్ బాస్ హోస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బ్యూటీ

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ ‘దేవర’ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. సినిమాలో సైఫ్ పాత్ర పేరు భైరా. ఇప్పుడు విడుదలైన టీజర్‌లో, సైఫ్ అలీ ఖాన్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. భైరా స్టైల్, అతని బాడీ లాంగ్వేజ్, క్రూరత్వం ప్రదర్శించే కొన్ని సన్నివేశాలు కూడా టీజర్‌లో ఉన్నాయి. ‘దేవర’ పాత్రకు తగిన ప్రత్యర్థిగా సైఫ్ అలీఖాన్ పాత్రను పరిచయం చేశారు. ‘దేవర’ సినిమా రెండు భాగాలుగా రానుందని, రెండు పార్టుల్లో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తాడని అంటున్నారు.

ఇది కూడా చదవండి : Venu Swamy: రకుల్ కూడా భర్త నుంచి విడిపోతుంది.. ఎంగేజ్మెంట్ అప్పుడే చెప్పానన్న వేణు స్వామి

ఈ సినిమా మొదటి భాగానికి సంబంధించిన చిన్న టీజర్ మాత్రమే ఇప్పుడు విడుదలైంది. టీజర్‌లోనే.. సైఫ్ అలీఖాన్ ఇలా ఉన్నాడంటే సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి. ‘దేవార’ పాత్రకు సైఫ్‌లో గట్టిపోటీ ఇచ్చే విలన్‌ గా కనిపించనున్నాడు. ‘దేవర’ సినిమా సెప్టెంబర్ 9న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వికపూర్ హీరోయిన్ గా చేస్తోంది. మరికొందరు నటీమణులు కూడా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాపై యంగ్ ఎన్టీఆర్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ హిందీలో ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమా కూడా చేస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..