ప్రేమలో మునిగి ఉన్నానంటున్న సాయిపల్లవి.. ఆసక్తికరంగా ట్వీట్ చేసిన హైబ్రిడ్ పిల్ల..
రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా.. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'విరాటపర్వం'. ఎస్.ఎల్.వి సినిమాస్

రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా.. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘విరాటపర్వం’. ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ పై డి.సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. తాజాగా సాయి పల్లవి ఈ సినిమా గురించి ఆసక్తికరంగా ట్వీట్ చేసింది.
సాయిపల్లవి షేర్ చేసిన ఫోటోలో కాకతీయ తోరణం వద్ద డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ పోస్టర్ ను ఉద్దేశిస్తూ.. “ప్రేమలో మునిగి ఉన్న వెన్నెల” అంటూ సాయిపల్లవి ట్విట్టర్లో పేర్కోంది. ఈ నెల 25న ఈ సినిమాలోని కోలు కోలు అనే లిరికల్ సాంగ్ విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్ కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నారు.
Premalo munigi unna Vennela ❤️@venuudugulafilm @RanaDaggubati @SLVCinemasOffl @SureshProdns #KoluKolu #VirataParvam pic.twitter.com/bauCUKMU67
— Sai Pallavi (@Sai_Pallavi92) February 22, 2021
Also Read:
తారక్‌కు విలన్‌గా సేతుపతి.. అన్నీ కుదిరితే రేర్ కాంబో.. రికార్డులు బద్దలు కావడం ఖాయం.!




