Premam Movie: వాలెంటైన్ వీక్.. థియేటర్లలోకి అందమైన ప్రేమకథ.. సూపర్ హిట్ ‘ప్రేమమ్’ రీ రిలీజ్.. కానీ..
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన చిత్రాలు కూడా మళ్లీ విడుదలై భారీ వసూళ్లు రాబట్టాయి. అయితే ఇప్పటివరకు తెలుగులోనే రీరిలీజ్ ట్రెండ్ కొనసాగింది. కానీ ఇప్పుడు తమిళంలోనూ ఈ ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి వాలెంటైన్ వీక్ లో ప్రేమికుల కోసం అందమైన ప్రేమకథలను మరోసారి రిలీజ్ చేస్తున్నారట. అందులో భాగంగానే సూపర్ హిట్ 'ప్రేమమ్' సినిమాను మళ్లీ విడుదల చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.
ఇండస్ట్రీలో మళ్లీ రీరిలీజ్ ట్రెండ్ స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే అనేక సినిమాలు మరోసారి అడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన చిత్రాలు కూడా మళ్లీ విడుదలై భారీ వసూళ్లు రాబట్టాయి. అయితే ఇప్పటివరకు తెలుగులోనే రీరిలీజ్ ట్రెండ్ కొనసాగింది. కానీ ఇప్పుడు తమిళంలోనూ ఈ ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి వాలెంటైన్ వీక్ లో ప్రేమికుల కోసం అందమైన ప్రేమకథలను మరోసారి రిలీజ్ చేస్తున్నారట. అందులో భాగంగానే సూపర్ హిట్ ‘ప్రేమమ్’ సినిమాను మళ్లీ విడుదల చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. కానీ ఈ చిత్రాన్ని తెలుగులో మాత్రం కాదండి. కేవలం తమిళంలోనే. అల్ఫోన్స్ పుత్రన్ దర్శకత్వంలో నివిన్ పౌలీ, సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ప్రేమమ్. ఈ సినిమా మలయాళంలో 2015లో విడుదలైంది. హీరోయిన్ సాయిపల్లవికి ఇదే తొలి సినిమా కావడం విశేషం.
ఇందులో మలర్ అనే టీచర్ పాత్రను పోషించింది సాయి పల్లవి. ఈ సినిమా మలయాళం, తమిళంలో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా కేవలం మలయాళంలో విడుదలైనప్పటికీ, తమిళం, తెలుగు, కన్నడ అభిమానుల్లో ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. ఇక ఇదే సినిమాను తెలుగులోనూ రీమేక్ చేశారు. సాయి పల్లవి పాత్రన శ్రుతిహాసన్ పోషించగా.. నాగచైతన్య హీరోగా నటించారు. దాదాపు రూ.4 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ. 60 కోట్లు రాబట్టింది.
ఇకర ఇప్పుడు ఈ సినిమాను వచ్చే నెల ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే వారంలో మళ్లీ థియేటర్లలో రీరిలీజ్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. దీంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ వార్త నెట్టింట వైరల్ కావడంతో.. ఇటు తెలుగులోనూ ప్రేమమ్ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో రీమేక్ అయిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.