AI Services: రిక్రూట్‌మెంట్‌ నిలిపేసిన టెక్‌ కంపెనీ.. ఇక ఏఐపైనే ఆధారం

మీరంతా మంచు విష్ణు నటించిన ఢీ సినిమా చూసే ఉంటారు. అందులో హీరో విష్ణు శ్రీహరితో కంప్యూటర్‌ వల్ల ఉపయోగాలు చెబుతూ పది మంది పది రోజుల్లో చేసే పని ఒక్కరోజులో అవుతుందని చెప్పే డైలాగే మీకు గుర్తు ఉండే ఉంటుంది. అయితే తాజాగా ఓ టాప్‌ టెక్‌ కంపెనీ ఏఐ రాకతో ఎక్కువ పని అవుతుందని పేర్కొంటూ ఉద్యోగ రిక్రూట్‌మెంట్‌ నిలిపేసింది.

AI Services: రిక్రూట్‌మెంట్‌ నిలిపేసిన టెక్‌ కంపెనీ.. ఇక ఏఐపైనే ఆధారం
Artificial Intelligence
Follow us
Srinu

|

Updated on: Dec 19, 2024 | 1:47 PM

బై నౌ పే లేటర్‌ సేవలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ క్లార్నా నూతన రిక్రూట్‌మెంట్‌లను నిలిపేసిందని. ఇటీవలే ఆ కంపెనీ సీఈఓ సెబాస్టియన్ సిమియాట్‌కోవ్స్కీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇప్పుడు సాంప్రదాయకంగా మానవ ఉద్యోగులు నిర్వహించే దాదాపు అన్ని పనులను చేస్తుందని పేర్కొన్నారు. ఇటీవల ఓ చానల్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో, సిమియాట్‌కోవ్స్కీ ఏఐ కంపెనీలో అనేక పాత్రలను నిర్వహించగలిగే స్థాయికి ఎదిగిందని సూచించారు. ఒక సంవత్సరం క్రితం నుంచే క్లార్నా కొత్త సిబ్బందిని నియమించుకోవడం ఆపివేసిందని దాని వల్ల శ్రామికశక్తి క్రమంగా తగ్గిందని సిమియాట్‌కోవ్స్కీ వెల్లడించారు. గతంలో 4,500 మంది ఉద్యోగులు ఉన్న కంపెనీ ఇప్పుడు 3,500 మందిని కలిగి ఉంది.

సాంకేతిక సంస్థల్లో సాధారణంగా వార్షిక అట్రిషన్ రేటు కారణంగా 20 శాతం రీప్లేస్‌మెంట్‌లు ఉంటాయి. అయితే ఆ స్థానాలను భర్తీ చేసుకోకుండా క్లార్నా వర్క్‌ఫోర్స్‌ను కుదించడాన్ని ఎంచుకుంది. ముఖ్యంగా ఆటోమేషన్ కోసం ఏఐను వినియోగిస్తున్నారు. ఈ మార్పు ఉన్నప్పటికీ ప్రస్తుత ఉద్యోగుల జీతాలు ప్రతికూలంగా ప్రభావితం కాకూడదని సిమియాట్కోవ్స్కీ సూచించారు. వాస్తవానికి తక్కువ మంది సిబ్బంది కారణంగా క్లార్నాకు సంబంధించిన మొత్తం జీతం ఖర్చులు తగ్గుతున్నందున మిగిలి ఉన్న వారికి భారీగా జీతం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగాలపై ఏఐ ప్రభావం గురించి ప్రపంచవ్యాప్త చర్చలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ  ఇంటర్వ్యూ వైరల్‌ అయ్యింది. 

మెకిన్సే & కంపెనీ 2023 నివేదిక ప్రకారం ఏఐ అభివృద్ధి చెందుతూనే ఉందని, ముఖ్యంగా 2030 నాటికి మిలియన్ల మంది కార్మికులు కొత్త ఉద్యోగాలు చూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కొత్త సిబ్బందిని చురుగ్గా నియమించకూడదని క్లార్నా తీసుకున్న నిర్ణయం ఏఐ ఇప్పటికే ఎలా రూపాంతరం చెందుతోందనేదానికి ఒక నిర్దిష్ట ఉదాహరణగా పరిగణించాలని నిపుణులు చెబుతున్నారు. క్లార్నా వెబ్‌సైట్‌లో కొన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు పేర్కొంటున్నప్పటికీ ఇంజనీరింగ్‌లో ముఖ్యమైన పాత్రలకు మాత్రమే నియామకాలు చేస్తున్నారని వివరిస్తున్నారు. కాలక్రమేణా ఏఐ వారి కార్యకలాపాల్లో విలీనం అవుతున్నందున టెక్ కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్ వ్యూహాలను క్రమంగా సర్దుబాటు చేస్తున్నాయని పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రిక్రూట్‌మెంట్‌ నిలిపేసిన టెక్‌ కంపెనీ.. ఇక ఏఐపైనే ఆధారం
రిక్రూట్‌మెంట్‌ నిలిపేసిన టెక్‌ కంపెనీ.. ఇక ఏఐపైనే ఆధారం
95 ఏళ్లుగా ఈ దేశంలో ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు..! కారణం ఏంటంటే..
95 ఏళ్లుగా ఈ దేశంలో ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు..! కారణం ఏంటంటే..
మెడలో మంగళసూత్రంతో సినిమా ప్రమోషన్స్‌లో కీర్తి సురేశ్.. వీడియో
మెడలో మంగళసూత్రంతో సినిమా ప్రమోషన్స్‌లో కీర్తి సురేశ్.. వీడియో
ఈ ఏడాది యూట్యూబ్‍లో ఎక్కువమంది చూసిన వీడియోస్ ఇవే..
ఈ ఏడాది యూట్యూబ్‍లో ఎక్కువమంది చూసిన వీడియోస్ ఇవే..
ఆర్ అశ్విన్ కు ఆరోన్ ఫించ్ ట్రిబ్యూట్
ఆర్ అశ్విన్ కు ఆరోన్ ఫించ్ ట్రిబ్యూట్
అఫీషియల్ అప్‌డేట్.! మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ఫైనలా.?
అఫీషియల్ అప్‌డేట్.! మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ఫైనలా.?
వెంటాడిన విషాదం.. నాలుగేళ్ల మనవడిని, తాతయ్యను మింగేసిన బాల్కనీ..
వెంటాడిన విషాదం.. నాలుగేళ్ల మనవడిని, తాతయ్యను మింగేసిన బాల్కనీ..
కొరియర్ ఢిల్లీకి పంపితే.. పాడుబడ్డ ఇంట్లో అసలు గుట్టు బయటపడింది..
కొరియర్ ఢిల్లీకి పంపితే.. పాడుబడ్డ ఇంట్లో అసలు గుట్టు బయటపడింది..
G20 టాలెంట్ వీసాను ఆమోదించిన కేంద్ర హోం శాఖ.. ప్రయోజనాలివే
G20 టాలెంట్ వీసాను ఆమోదించిన కేంద్ర హోం శాఖ.. ప్రయోజనాలివే
కుప్పకూలిపోయిన ఇందిరా దేవి.. కళావతే దిక్కు అనుకున్న రాజ్..
కుప్పకూలిపోయిన ఇందిరా దేవి.. కళావతే దిక్కు అనుకున్న రాజ్..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..