19 December 2024

IAS కావాల్సిన అమ్మాయి.. వాసెలిన్ యాడ్‌తో హీరోయిన్ అయ్యింది..

Rajitha Chanti

Pic credit - Instagram

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. కానీ ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ పై మనసు పారేసుకుంది. ఇంతకీ ఆ వయ్యారి ఎవరో తెలుసా.

ఉన్నత చదువులు చదివి IAS కావాలని ఎన్నో కలలు కన్న ఆ అమ్మాయి.. అనూహ్యంగా సినీరంగం వైపు అడుగులు వేసింది. ఇప్పుడు ఆమె స్టార్ హీరోయిన్. 

ఆమె మరెవరో కాదు. తెలుగు సినీప్రియులకు పరిచయం లేని హీరోయిన్ రాశీ ఖన్నా. అనేక చిత్రాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమ్ సంపాదించుకుంది. 

అయితే రాశీ ఖన్నా చిన్నప్పటి నుంచి IAS కావాలనుకుందట. అందుకోసం ఎంతో కష్టపడి చదివిందట. స్కూల్లో ఆమె టాపర్. కానీ హీరోయిన్ అయ్యింది. 

ప్రపంచం మొత్తంలో భద్రత లేని జాబ్ అంటే అది నటీనటులు కావడమే అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాను కోరుకున్నది జరగలేదట. 

మద్రాస్ కేఫ్ సినిమాతో నటిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది. ఈ చిత్రంలో ఆమె పోషించిన పాత్ర చాలా చిన్నది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో ఆఫర్స్ వచ్చాయి.

ఇటీవలే అరణ్మనై 4 చిత్రంలో నటించి మెప్పించింది. అలాగే ది సబర్మతి రిపోర్ట్ మూవీలో నటించి మెప్పించింది. ప్రస్తుతం తలాఖోన్ మే ఏక్ చిత్రంలో నటిస్తుంది. 

సినీరంగంలోకి అడుగుపెట్టకముందు వాసెలిన్ యాడ్ లో నటించింది. కెరీర్ ప్రారంభంలో వాణిజ్య ప్రకటనలలో నటించింది. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్.