Ramayan Movie: రామాయణం సినిమాకు కొత్త టైటిల్.. సాయి పల్లవి, రణబీర్ చిత్రానికి ఎవరూ ఊహించని పేరు..

|

May 19, 2024 | 3:29 PM

ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండగానే ఇబ్బందుల్లో పడినట్లు వార్తలు వచ్చాయి. అల్లు అరవింద్, మధు మంతెన బృందం ప్రైమ్ ఫోకస్ మీడియాతో ఒప్పందంలో భాగంగా తమకు చెల్లించాల్సినవి ఇంకా చెల్లించలేదని.. అందుకే సినిమా నిర్మించడానికి వీల్లేందంటూ ప్రకటన విడుదల చేసినట్లు కథనాలు వచ్చాయి. అయితే దీనిపై ఇటు మేకర్స్ స్పందించలేదు.

Ramayan Movie: రామాయణం సినిమాకు కొత్త టైటిల్.. సాయి పల్లవి, రణబీర్ చిత్రానికి ఎవరూ ఊహించని పేరు..
Ramayana
Follow us on

బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం సినిమా గురించి నిత్యం ఏదోక వార్త నెట్టింట వినిపిస్తుంటుంది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందు నుంచి ఏదోక అప్డేట్ వైరలవుతుంది. దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్‏తో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మొత్తం మూడు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి కనిపించనున్నారు. ఇదివరకే వీరికి సంబంధించిన షూటింగ్ ఫోటోస్ లీకయ్యాయి. ఇక రావణుడిగా యష్, ఆంజనేయుడిగా సన్నీ డియోల్, రకుల్, లారా దత్తా వంటి నటీనటులు కీలకపాత్రలు పోషించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండగానే ఇబ్బందుల్లో పడినట్లు వార్తలు వచ్చాయి. అల్లు అరవింద్, మధు మంతెన బృందం ప్రైమ్ ఫోకస్ మీడియాతో ఒప్పందంలో భాగంగా తమకు చెల్లించాల్సినవి ఇంకా చెల్లించలేదని.. అందుకే సినిమా నిర్మించడానికి వీల్లేందంటూ ప్రకటన విడుదల చేసినట్లు కథనాలు వచ్చాయి. అయితే దీనిపై ఇటు మేకర్స్ స్పందించలేదు.

అయితే ఇప్పుడు రామాయణం గురించి మరో వార్త ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ మారుస్తున్నారట. ఈ చిత్రానికి గాడ్ పవర్ అనే కొత్త వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలోని ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. కానీ ఇప్పటికే నెట్టింట లీక్ అయిన సాయి పల్లవి, రణబీర్ ఫోటోస్ చూస్తుంటే ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైన కొద్ది రోజుల్లోనే ఫోటోస్ లీక్ కావడంతో చిత్రయూనిట్ కీలక నిర్ణయం తీసుకుందట. ఈ సినిమాకు సంబంధించిన గోప్యతను కొనసాగించడానికి ఇండోర్ షూటింగ్ చేస్తున్నారట. అధికారిక ప్రకటన, విడుదల తేదీ వెల్లడించేవరకు సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటోస్ లీక్ కాకుండా చూడాలనుకుంటున్నారట. ఇప్పటివరకు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఖరీదైన సినిమాగా నిలిచింది రామాయణం.. పోస్ట్ ప్రొడక్షన్ పనికి దాదాపు 600 రోజుల సమయం పడుతుందట. రామాయణం: పార్ట్ వన్ అక్టోబర్ 2027లో విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.