సాయి పల్లవి చేతికి ఆ మాల​ ఉండాల్సిందే..ఎందుకంటే?

సాయి పల్లవి..హైబ్రిడ్ పిల్ల‌..ఒక్క‌టే పీస్. సినిమాలో మాత్ర‌మే కాదు. బ‌య‌ట కూడా ఆ మాట నిజ‌మేనేమో అనిపిస్తుంది. ఆమెను చూస్తున్న‌ప్పుడ‌ల్లా పక్కింటి పిల్లలానే అనిపిస్తుంది

సాయి పల్లవి చేతికి ఆ మాల​ ఉండాల్సిందే..ఎందుకంటే?

Updated on: Jul 11, 2020 | 10:41 PM

సాయి పల్లవి..హైబ్రిడ్ పిల్ల‌..ఒక్క‌టే పీస్. సినిమాలో మాత్ర‌మే కాదు. బ‌య‌ట కూడా ఆ మాట నిజ‌మేనేమో అనిపిస్తుంది. ఆమెను చూస్తున్న‌ప్పుడ‌ల్లా పక్కింటి పిల్లలానే అనిపిస్తుంది. నేచుర‌ల్ గా ఉంటూ అభిమానుల‌ను బుట్ట‌లో వేసుకుంటుంది. అయితే సాయి ప‌ల్ల‌విని బ‌య‌ట ఎప్పుడైనా చూడండి. చేతికి జ‌ప‌మాల‌​ క‌నిపి‌స్తుంటుంది. సంప్రదాయ, మోడ‌ర‌న్.. ఇలా ఏ దుస్తుల్లో ఉన్నా ఈ మాల‌ మాత్రం త‌ప్ప‌నిస‌రిగా క‌నిపిస్తుంది. అయితే తను ఆ చైన్​ ఎందుకు ధ‌రిస్తుందో ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపింది. అది తన తాత‌య్య ఇచ్చిన జ‌ప మాల అని..దానితో ప్రేయ‌ర్ చేస్తుంటాన‌ని తెలిపింది,

ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో ‘విరాట పర్వం’ అనే మూవీలో నటిస్తోంది‌. రానా హీరోగా చేస్తోన్న ఈ మూవీలో వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే పల్లవి పుట్టినరోజు సందర్భంగా ఓ పోస్టర్​ను విడుదల చేసింది మూవీ యూనిట్. దీంతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్​స్టోరీ’లో నటించిందీ నేచుర‌ల్ బ్యూటీ. నాగ చైతన్య హీరోగా కనిపించనున్న ఈ సినిమా రిలీజ్ కోవిడ్-19 కారణంగా వాయిదా పడింది.