Tollywood: అమ్మాయి అనుకునేరు.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో.. గుర్తుపట్టండి..

|

Mar 07, 2025 | 8:10 PM

తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈహీరో.. ఓ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. పీరియాడిక్‌ కథతో ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభవాన్ని పంచేలా ఈ వస్తున్నట్లు సమాచారం.

Tollywood: అమ్మాయి అనుకునేరు.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో.. గుర్తుపట్టండి..
Hero Childhood Photo
Follow us on

పైన ఫోటోలో ఉన్న ఈ క్యూట్‌గా ఉన్న ఈ పాప ఎవరో గుర్తుపట్టండి. అమ్మాయి అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఆ ఫోటోలో బూరబుగ్గెలతో ఉన్న ఆ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ హీరో. తెలుగునాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. అది ఎంట్రీ ఇచ్చేవరకే పరిమితం. ఆ తర్వాత ఎదగాలంటే.. కష్టపడే తత్వం ఉండాలి. అలానే ముందుకు సాగుతూ మంచి హిట్స్ అందుకున్నాడు ఈ హీరో. అటు మాస్ ఇమేజ్, కామెడీ టైమింగ్ మాత్రమే కాదు.. ఫేస్ కట్స్‌లోనూ మేనమామను పోలి ఉంటాడు. బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. మృత్యువును జయించిన ఈ హీరో.. ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికీ మీకో ఐడియా వచ్చి ఉంటుంది. తను మరెవరో కాదు మెగా మేనల్లుడు సాయిదుర్గా తేజ్‌.

మెగా హీరో సాయిదుర్గా తేజ్‌ చిన్నప్పడు తన తల్లితో కలిసి దిగిన ఫోటో ఇది. తేజ్.. పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతో హిట్ అందుకున్న ఈ హీరో.. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, తిక్క, ప్రతిరోజూ పండగే, సోలో లైఫే సో బెటర్, వీరూపాక్ష  చిత్రాల్లో నటించి మెప్పించారు. తాజాగా తేజ్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఉన్నది..సాయిదుర్గా తేజ్‌ అంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.  సాయిదుర్గా తేజ్‌ కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ.125 కోట్ల వ్యయంతో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న చిత్రమిది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..