Virupaksha: సినిమా ఆలస్యం అయ్యింది.. థియేటర్ పై దాడి చేసిన సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్

|

Apr 24, 2023 | 8:56 AM

రోడ్డు ప్రమాదం నుంచి కోలుకొని తిరిగి చేసిన సినిమా విరూపాక్ష. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తేజ్ కు మంచి సక్సెస్ ఇచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నారు.

Virupaksha: సినిమా ఆలస్యం అయ్యింది.. థియేటర్ పై దాడి చేసిన సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్
Virupaksha
Follow us on

మెగా మేనల్లుడు చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ అందుకున్నారు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోన్న తేజ్. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకొని తిరిగి చేసిన సినిమా విరూపాక్ష. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తేజ్ కు మంచి సక్సెస్ ఇచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నారు. తాజాగా విరూపాక్ష సినిమా వేయలేదు అని థియేటర్ పై దాడి చేశారు తేజ్ ఫ్యాన్స్. హైదరాబాద్‌ లోని ఓ థియేటర్ పై దాడి చేశారు ఫ్యాన్. టికెట్ కొనుకొని థియేటర్ లోకి వెళ్లిన తర్వాత సినిమా వేయడం ఆలస్యం అవ్వడంతో ఫాన్స్ ఫైర్ అయ్యారు.

విరూపాక్ష సినిమాకు రోజు రోజుకు ప్రేక్షకాదరణ పెరుగుతోంది. సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సాయంత్రం ఆరు గంటలకు థియేటర్  లోపలకు వెళ్లిన ప్రేక్షకులు గంటకు పైగా షో కోసం వేచి చూశారు. ఎంత సేపటికి సినిమా వేయకపోవడంతో ప్రేక్షకులు సహనం కోల్పోయారు.

గంటన్నర తర్వాత కూడా సినిమా వేయకపోవడంతో  సాయిధరమ్‌ తేజ్‌ అభిమానులు మండిపడ్డారు. సహనం కోల్పోయిన  సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ థియేటర్‌పై దాడి చేశారు. థియేటర్‌ అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఫ్యాన్స్ కు సర్ది చెప్పారు.