
తాను క్షేమంగా, ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని గాయని ఎస్.జానకి తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ నమ్మొదని ఆడియో సందేశాన్ని పంపారు. ఎస్.జానకి తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, కన్నుమూశారంటూ గత కొన్నిరోజులుగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు సర్కులేట్ అయ్యాయి. కాగా ఈ వార్తలపై ఆమె స్పందించారు.
”నేను ఆరోగ్యంగా ఉన్నా. ఎటువంటి ఆరోగ్య సమస్యా లేదు. సోషల్ మీడియా వేదికగా పెట్టే వాటిని నమ్ముతూ కూర్చుంటే మనం ఏం చేయలేం. నా అభిమానులందరూ బాధపడుతూ ఫోన్ చేస్తున్నారు. వాళ్లకు ధైర్యం చెప్పడమే సరిపోయింది . తెలిసీ, తెలియకుండా ఇలాంటి వార్తలు ఎందుకు ప్రచారం చేస్తారు. విషయం తెలియకుండా ఎవరికి తోచినట్లు వారు పోస్ట్‌లు పెట్టొద్దు. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి అందరూ జాగ్రత్తలు తీసుకోండి” అని జానకి సందేశాన్ని పంపారు.