Jr NTR : ఆ సూపర్ హిట్ సినిమాకు యంగ్ టైగర్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడా..? అసలు విషయం ఏంటంటే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రకృతిని కాపాడాలనే మెసేజ్‌తోపాటు అదిరిపోయే

Jr NTR : ఆ సూపర్ హిట్ సినిమాకు యంగ్ టైగర్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడా..? అసలు విషయం ఏంటంటే..
Ntr

Updated on: Sep 02, 2021 | 8:38 PM

Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రకృతిని కాపాడాలనే మెసేజ్‌తోపాటు అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక  ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసిన తారక్ త్వరలోనే కొరటాల సినిమాను మొదలపెట్టనున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా జనతా గ్యారేజ్‌కు సీక్వెల్ అంటూ కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. ఇటీవల తారక్ లుక్ చూసిన కొందరు అచ్చం జనతా గ్యారేజ్ గెటప్‌లానే ఉందని.. ఇప్పుడు చేసే సినిమా జనతా గ్యారేజ్‌కు సీక్వెల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే కొరటాల శివ ఇంతవరకూ ఎప్పుడూ సీక్వెల్ చేయలేదు .. అలాగే ఎన్టీఆర్ కూడా ఆ వైపు అడుగువేయలేదు. అందువలన ఇది కేవలం రూమర్ మాత్రమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

ఇక తారక్ ఇటీవలే ఆర్‌ఆర్ఆర్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో గిరిజన వీరుడు కొమురం భీంగా కనిపించనున్నాడు తారక్. ఈ పాత్రకోసం చాలా కష్టపడ్డాడు యంగ్ టైగర్. అలాగే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే కొరటాల శివ-తారక్ సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజాహెగ్డే నటిస్తుందని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pawan Kalyan Birthday: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు హరిహరవీరమల్లు చిత్రమూనిట్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ..రిలీజ్ ఎప్పుడంటే

Happy Birthday Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేర్, చైల్డ్‌హుడ్ ఫొటోస్.. మీరు ఓ లుక్ వేయండి..

Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష ఇంస్టాగ్రామ్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ