Nayanthara: సినిమాలకు లేడీ సూపర్ స్టార్ గుడ్ బై.. నయన్ షాకింగ్ నిర్ణయం ?.. ఆందోళనలో ఫ్యాన్స్..

|

Sep 04, 2022 | 7:22 AM

అయితే తాజాగా నయనతారకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

Nayanthara: సినిమాలకు లేడీ సూపర్ స్టార్ గుడ్ బై.. నయన్ షాకింగ్ నిర్ణయం ?.. ఆందోళనలో ఫ్యాన్స్..
Nayan
Follow us on

దక్షిణాది లేడీ సూపర్ స్టార్‏గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నయనతార. అతి తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా నిలిచి.. దాదాపు హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. ఇటీవలే తమిళ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‏ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆరేళ్లుగా ప్రేమలో వీరిద్దరు ఏప్రిల్ నెలలో ఇరువురు కుటుంబసభ్యుల సమక్షంలో మూడు మూళ్ల బంధంతో ఒకటయ్యారు. ప్రస్తుతం వీరు విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే నయన్ జవాన్ సినిమా షూటింగ్‏లో పాల్గోననున్నారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. అయితే తాజాగా నయనతారకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

త్వరలోనే నయన్ నటనకు గుడ్ బై చెప్పనుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. గత కొద్ది రోజులుగా ఆమె తన సంపాదన మొత్తాన్ని ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతూ వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. కేవలం తాను మాత్రమే కాకుండా భర్త విఘ్నేష్‏తో కలిసి పలు రంగాల్లో ఇప్పటికే అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టారు నయన్. ఈ క్రమంలోనే ఇక తాను నటనకు స్వస్తి చెప్పి వ్యాపారరంగంలో స్థిరపడాలని భావిస్తుందని.. నిర్మాతగా మారి చిత్రాలను నిర్మించాలని భావిస్తున్నట్లుగా సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అంతేకాకుండా తన కెరీర్ గురించి వస్తున్న వార్తలపై నయన్, విఘ్నేష్ ఇప్పటివరకు స్పందించలేదు.