
RRR సినిమా షూటింగ్ ఉక్రెయిన్‌లో జరిగిన విషయం అందరికి తెలుసు.. ఆనాడు హీరో రామ్‌చరణ్(Ram Charan) బాడీగార్డ్‌గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా ? ఉక్రెయిన్ తరపున యుద్దంలో పోరాడుతున్నాడు. బాడీగార్డ్ 80 ఏళ్ళ తండ్రి కూడా గన్ పట్టుకుని యుద్ధంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో కష్టాల్లో ఉన్న తన మాజీ బాడీగార్డ్ కుటుంబాన్ని ఆదుకొని పెద్ద మనస్సు చాటుకున్నాడు రామ్‌చరణ్ . నిత్యావసర వస్తువులను, ఇతర సామాగ్రిని కొనుగోలు చేయడానికి హైదరాబాద్ నుంచి డబ్బును పంపించారు. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా పౌరులు కూడా సైన్యంలో చేరాలని పిలుపునిచ్చారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. ఆ పిలుపుకు స్పందించిన రామ్‌చరణ్ మాజీ బాడీగార్డ్ రస్టీ ఉక్రెయిన్ సైన్యంలో చేరాడు. రష్యా సైన్యానికి వ్యతిరేకంగా అతడు పోరాడుతున్నాడు. కాని రష్యా దురాక్రమణ కారణంగా రస్టీ కుటుంబం కూడా కష్టాలు పడుతోంది. తన మాజీ బాడీగార్డ్ యుద్దం కారణంగా బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న రామ్‌చరణ్ అతడికి ప్రత్యేక పార్సిల్ పంపించాడు. రామ్‌చరణ్ చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపాడు రస్టీ. రామ్‌చరణ్ పంపించిన మందులతో అనారోగ్యంతో ఉన్న తన భార్య కోలుకుందని , ఆయనకు ఎప్పటికి రుణపడి ఉంటానని తెలిపారు రస్టీ.