నటసింహ బాలయ్య ఈ సంక్రాంతికి ‘వీర సింహారెడ్డి’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఫ్యాక్షన్ బేస్డ్ స్టోరీతో ఈ చిత్రం తెరకెక్కింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘రోర్’ పేరుతో తాజాగా సినిమా మేకింగ్ వీడియోను షేర్ చేసింది మూవీ యూనిట్. సినిమాలోని పలు కీ సీన్స్ ఎలా షూట్ చేశారో ఇందులో చూపించారు. బాలకృష్ణ వైట్ అండ్ వైట్ వేస్తే.. గతంలో రికార్డులు బద్దలయ్యాయి. సమర సింహా రెడ్డి, నరసింహ నాయుడు, చెన్నకేశవ రెడ్డి, సింహా, లెజెండ్ సినిమాలు ఎలాంటి హిట్స్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా అదే ఫ్లేవర్ కనిపిస్తుంది. ఇక ఈ మేకింగ్ వీడియో మధ్యలో బాలయ్య తనయుడు మోక్షజ్ఞతో పాటు, తనయ తేజస్విని కూడా తళుక్కున మెరిశారు.
ఫ్యాన్స్‌కు, మాస్ ఆడియెన్స్‌కు ఈ సినిమా ఫుల్ మీల్స్ అని అర్థం అయిపోతుంది. అఖండ రేంజ్ హిట్ ఖాయం అని తెలిసిపోతుంది. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో కూడా ‘వీర సింహా రెడ్డి’ దుమ్మురేపుతుంది. 60 ప్లస్‌లో కూడా అన్‌స్టాపబుల్ అంటూ దూసుకుపోతున్నారు బాలయ్య.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి