Kantara: కొనసాగుతున్న కాంతార మూవీ హవా.. ఇప్పుడు ఆ భాషలో కూడా..

|

Dec 01, 2022 | 1:00 PM

ముందుగా కన్నడ భాషలో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ఈ సినిమాను ఇతర భాషల్లోకి రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని భాషలో సంచలన విజయాన్ని అందుకుంది కాంతార

Kantara: కొనసాగుతున్న కాంతార మూవీ హవా.. ఇప్పుడు ఆ భాషలో కూడా..
Kantara Movie
Follow us on

కాంతర సినిమా థియేటర్స్ లోనే కాదు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. ఈ సినిమా కోసం  అన్ని భాషల ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. చిన్న సినిమా గా వచ్చిన కాంతార సంచలన విజయం సాధించింది. ముందుగా కన్నడ భాషలో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ఈ సినిమాను ఇతర భాషల్లోకి రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని భాషలో సంచలన విజయాన్ని అందుకుంది కాంతార. ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటన హైలైట్ అనే చెప్పాలి. సినిమా అంతా ఒక ఎత్తు.. క్లామాక్స్ 20 నిముషాలు మరో ఎత్తు.. థియేటర్స్ లో దుమ్మురేపిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ ఆకట్టుకుంటుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కాంతారా సినిమాను స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ సినిమాకు ఓటీటీలో కూడా మంచి వ్యూయర్ షిప్ వస్తోంది.

ఇటీవలే ఈ సినిమాలు పలు భాషల్లోకి డబ్ చేశారు. ఈ సినిమా నవంబర్ 24 నుంచి తెలుగుతోపాటు కన్నడ, తమిళ, మలయాళీ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌‌కు వచ్చేసింది. తులు భాషలో కూడా ఈ సినిమాను డబ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా మరో భాషలో కూడా డబ్ కానుంది. ఈ సారి ఏకంగా ఇంగ్లీష్ లో డబ్ చేసి వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

ఇంగ్లీష్ వర్షన్ థియేటర్స్‌లో విడుదలకానుందా లేక ఓటీటీకే పరిమితం కానుందా అనేది తెలియాల్సి ఉంది.ఈ సినిమా తెలుగులో బాక్సాఫీస్ వద్ద రూ. 60 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి షాక్ ఇచ్చింది. ఇక షేర్ 30 కోట్లకు ఉండోచ్చని, ఇక ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల వరకు గ్రాస్ వసూలు అయ్యిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం..