Actor Darshan: దర్శన్, పవిత్ర మధ్య ఉన్న సంబంధం అదే.. అసలు విషయం చెప్పిన లాయర్.. జూన్ 20 వరకు కస్టడీ..

|

Jun 15, 2024 | 9:36 PM

ఈరోజు జూన్ 15న వీరందరిని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు బెంగుళూరు పోలీసులు. అలాగే పోలీసు కస్టడీని పొడగించాలని పోలీసులు కోరగా.. కోర్టు అంగీకరిస్తూ మరో ఐదు రోజులుపాటు కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసులో మొత్తం 19 మంది నిందితులు ఉండగా.. పదమూడు మందిని అరెస్ట్ చేయగా.. మిగతా కొందరు లొంగిపోయారు. ఈరోజు వీరందరిని కోర్టులో హాజరపరిచారు.

Actor Darshan: దర్శన్, పవిత్ర మధ్య ఉన్న సంబంధం అదే.. అసలు విషయం చెప్పిన లాయర్.. జూన్ 20 వరకు కస్టడీ..
Darshan, Pavithra Gowda
Follow us on

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి మర్డర్ కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్, అతడి ప్రియురాలు పవిత్ర గౌడ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈకేసులో రోజుకో ట్విస్టులు బయటకు వస్తున్నాయి. పవిత్రగౌడకు అసభ్యకరమైన మెసేజ్ లు పంపించాడనే కోపంతో పలువురు ఫ్యాన్స్ సహాయం తీసుకుని రేణుకాస్వామిని దారుణంగా హత్య చేశాడు దర్శన్. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడతోపాటు మరో పదమూడు మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈరోజు జూన్ 15న వీరందరిని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు బెంగుళూరు పోలీసులు. అలాగే పోలీసు కస్టడీని పొడగించాలని పోలీసులు కోరగా.. కోర్టు అంగీకరిస్తూ మరో ఐదు రోజులుపాటు కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసులో మొత్తం 19 మంది నిందితులు ఉండగా.. పదమూడు మందిని అరెస్ట్ చేయగా.. మిగతా కొందరు లొంగిపోయారు. ఈరోజు వీరందరిని కోర్టులో హాజరపరిచారు.

ఈ కేసుపై తదుపరి విచారణ, విచారణ అవసరమని.. కనుక మరిన్ని రోజులు పోలీసు కస్టడీకి అనుమతించాలని పోలీసుల తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్నకుమార్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మరో తొమ్మిది రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. దర్శన్ తరపు న్యాయవాది దీనిని వ్యతిరేకించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పోలీసు కస్టడీని ఐదు రోజుల పాటు పొడిగించారు.

ఇదిలా ఉంటే.. రేణుకాస్వామి హత్య కేసులో నగర పోలీస్ కమిషనర్ బి. దయానంద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఏ1 నిందితురాలు పవిత్ర గౌడ తాను దర్శన్ భార్యనని చెప్పినట్లు తెలిపారు. దీనిపై పవిత్ర తరపు న్యాయవాది మాట్లాడుతూ.. లాయర్ అనిల్ బాబు క్లారిటీ ఇచ్చారు. దర్శన్, పవిత్ర ఇంకా పెళ్లి చేసుకోలేదని.. వారిద్దరు కేవలం స్నేహితులు మాత్రమే అని అన్నారు. దర్శన్ ఇదివరకే విజయలక్ష్మి అనే మహిళను వివాహం చేసుకున్నాడని.. వీరికి వినీష్ అనే బాబు ఉన్నాడని తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.