
ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసి ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చారు రేణు దేశాయ్. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు. దీంతో రేణు మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. ఆ మధ్య రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు రేణూ దేశాయ్. టైగర్ నాగేశ్వర రావు సినిమా 2023లో విడుదలైంది. ఆతర్వాత ఇప్పటివరకు ఏ కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదీ అందాల తార. మొన్నీమధ్యనే బ్యాడ్ గర్ల్స్ అనే సినిమాలో నటించారు రేణు. సినిమాల విషయం పక్కనపెడితే రేణూ దేశాయ్ సామాజిక సేవా కార్యక్రమాలతో బిజి బిజీగా ఉంటారు. అనాథ పిల్లలు, పర్యావరణం, మూగ జీవాల సంరక్షణ కోసం తన వంతు కృషి చేస్తుంటారు.
ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు వచ్చే విమర్శలను తాను పెద్దగా పట్టించుకోనని, తనకు నచ్చిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటానని ఆమె స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కొనే విధానం గురించి మాట్లాడుతూ, మొదట్లో ఈ కామెంట్స్ తనను బాధపెట్టేవని, కానీ ఇప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదని రేణు దేశాయ్ అన్నారు. ప్రజల మనస్తత్వాలు మారవని, వారి మాటలకు సమాధానం చెప్పడం వల్ల ప్రయోజనం లేదని రేణు దేశాయ్ అన్నారు.
అలాగే మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం తనను సంప్రదించినట్లు రేణు దేశాయ్ తెలిపారు. ఆ పాత్ర చేయడానికి తాను ఆసక్తి చూపినప్పటికీ, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ అవకాశం చేజారిపోయిందని రేణు తెలిపారు. ఆ కారణాలను ఇప్పుడు బయటపెట్టడం అనవసర వివాదాలకు దారి తీస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు సినిమాలో ఆమె నటించాల్సింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..