
జేమ్స్ బాండ్ సినిమాల హీరో డేనియల్ క్రేగ్ గురించి సినిమా ప్రేమికులకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. సంచలనాత్మక విజయాలు నమోదు చేసుకున్న జేమ్స్ బాండ్ సిరీస్‌లో డేనియల్ ఐదుసార్లు హీరోగా నటించారు. తాజాగా ఇతడు జేమ్స్ బాండ్ సిరీస్ లో భాగంగా ‘నో టైమ్ టూ డై’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సిరీస్ తర్వాత జేమ్స్ బాండ్ సినిమాలకు డేనియల్ గుడ్‌బై చెప్పనున్నారు. దీంతో ఈ సినిమా విడుదల కోసం ఆడియెన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ట్రైలర్ యాక్షన్ ప్రియులను ఎంతగానో అలరించింది. మరోవైపు ఈ సినిమాను ఇండియాలో ఇంగ్లిష్‌తో పాటు, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇందుకవసరమైన డబ్బింగ్ కూడా పూర్తైపోయింది. కానీ ఈ చిత్ర విడుదల మరోసారి వాయిదా పడింది. 2021 ఏప్రిల్ 2 వరకు చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర వెబ్‌సైట్‌లో ఒక ప్రకటన తెలిపింది.
కాగా ‘నో టైమ్ టు డై’ చిత్రాన్ని తొలుత గత ఏడాది నవంబర్‌లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడింది. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో ముహూర్తం పెట్టినా, సాధ్యపడలేదు. ఎలాగైనా సరే.. ఏప్రిల్‌లో థియేటర్లలో బాండ్ అడుగుపెట్టడం పక్కా అన్నారు. కానీ కరోనా వైరస్ దెబ్బతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో పరిస్థితులు కుదుటపడ్డాక నవంబర్ లో రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 2021 కి వాయిదా వేశారు. దీంతో బాండ్ సిరీస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. ‘ఆలస్యం మా అభిమానులకు నిరాశ కలిగించిందని మేము అర్థం చేసుకున్నాము, కాని ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా తప్పడం లేదు’ అని మూవీ యూనిట్ పేర్కొంది.
Also Read :