Tiger Nageswara Rao 1st week collections: ‘టైగర్ నాగేశ్వర రావు’ బాక్సాఫీస్ రికార్డ్.. వారం రోజుల్లో ఎంత కలెక్షన్స్ అంటే..

ఈ చిత్రానికి నూతన దర్శకుడు వంశీ దర్శకత్వం వహించారు. అయితే అప్పటికే బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి, మరోవైపు దళపతి విజయ్ లియో చిత్రాలు విడుదల కావడంతో టైగర్ నాగేశ్వర రావు ఓపెనింగ్స్ కాస్త డల్ అయ్యాయి. కానీ ఆ తర్వాత రోజు నుంచి మాత్రం ఊపందుకున్నాయి. రోజు రోజూకీ టైగర్ నాగేశ్వర రావు కలెక్షన్స్ మరింత పెరుగుతూనే వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు వారం రోజుల్లో ఎంత కలెక్షన్స్ వచ్చాయనేది మేకర్స్ వెల్లడించారు. వరల్డ్ వైడ్ గా వారం రోజుల్లోనే

Tiger Nageswara Rao 1st week collections: టైగర్ నాగేశ్వర రావు బాక్సాఫీస్ రికార్డ్.. వారం రోజుల్లో ఎంత కలెక్షన్స్ అంటే..
Tiger Nageswara Rao collections

Updated on: Oct 28, 2023 | 6:59 AM

దసరా సందర్భంగా టైగర్ నాగేశ్వర రావు సినిమాతో అడియన్స్‏ను పలకరించాడు మాస్ మాహారాజా రవితేజ. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు వంశీ దర్శకత్వం వహించారు. అయితే అప్పటికే బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి, మరోవైపు దళపతి విజయ్ లియో చిత్రాలు విడుదల కావడంతో టైగర్ నాగేశ్వర రావు ఓపెనింగ్స్ కాస్త డల్ అయ్యాయి. కానీ ఆ తర్వాత రోజు నుంచి మాత్రం ఊపందుకున్నాయి. రోజు రోజూకీ టైగర్ నాగేశ్వర రావు కలెక్షన్స్ మరింత పెరుగుతూనే వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు వారం రోజుల్లో ఎంత కలెక్షన్స్ వచ్చాయనేది మేకర్స్ వెల్లడించారు. వరల్డ్ వైడ్ గా వారం రోజుల్లోనే రూ.50 కోట్లు రాబట్టినట్లు అధికారికంగా తెలిపారు. టైగర్ నాగేశ్వర రావు బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల మార్కును దాటిందంటూ చిత్ర నిర్మాణ సంస్థ అభిషేక్ ఆర్ట్స్ అగర్వాల్ ట్వీట్ చేసింది. అలాగే రెండో వారంలోనూ మంచి ప్రేక్షకాదరణతో కొనసాగుతుందని రాసుకొచ్చింది.

అయితే టైగర్ నాగేశ్వర రావు ప్రతీ రోజూ వసూళ్లను మాత్రం ఎంత అనేది వెల్లడించలేదు. మొదటి రోజు కంటే ఆ తర్వాత రోజు మాత్రం బుకింగ్స్ ఎక్కువగానే వచ్చాయంటూ తెలిపింది. ఇక ఇప్పుడు వారం రోజుల్లో రూ.50 కోట్లు మార్క్ క్రాస్ చేసిందని తెలిపారు. ఇప్పటివరకు రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా టైగర్ నాగేశ్వర రావు దూసుకుపోతుంది. మొదటి నుంచి మాస్ యాక్షన్ చిత్రాలతో అదరగొట్టేసిన రవితేజ.. ఇప్పుడు టైగర్ నాగేశ్వర రావు సినిమాతో ప్రయోగాత్మక చిత్రాలతో మెప్పించగలరు.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించగా..సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాతో ఆమె మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. 1970 దశకంలో దేశంలోనే అతిపెద్ద దొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వర రావు జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, హరీశ్ పెద్ది, సుదేవ్ నాయర్ కీలకపాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.