Eagle Twitter Review: ‘ఈగల్’ ట్విట్టర్ రివ్యూ.. మాస్ మహారాజా సినిమా ఎలా ఉందంటే..

టైగర్ నాగేశ్వరరావు సినిమా తర్వాత ఇందులో రవితేజ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. అలాగే ధమాకా సక్సెస్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై మాస్ మాహారాజా నటించిన ఈ మూవీ. ఈరోజు అడియన్స్ ముందుకు వచ్చింది ఈగల్. ఇప్పటికే ప్రీమియర్ షోస్, ఫస్ట్ షోస్ చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను చెప్పేస్తున్నారు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు డిజాస్టర్స్ తర్వాత రవితేజ నటించిన ఈ సినిమా ఎలా ఉంది ?.

Eagle Twitter Review: ఈగల్ ట్విట్టర్ రివ్యూ.. మాస్ మహారాజా సినిమా ఎలా ఉందంటే..
Eagle Twitter Review

Updated on: Feb 09, 2024 | 7:24 AM

డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మాహారాజా రవితేజ నటించిన లేటేస్ట్ మూవీ ‘ఈగల్’. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మాత్రం మూవీపై ఓ రేంజ్ ఆసక్తిని క్రియేట్ చేశాయి. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా థియేటర్లు సర్దుబాటు కాకపోవడంతో ఫిబ్రవరి 9న విడుదల చేశారు మేకర్స్. టైగర్ నాగేశ్వరరావు సినిమా తర్వాత ఇందులో రవితేజ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. అలాగే ధమాకా సక్సెస్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై మాస్ మాహారాజా నటించిన ఈ మూవీ. ఈరోజు అడియన్స్ ముందుకు వచ్చింది ఈగల్. ఇప్పటికే ప్రీమియర్ షోస్, ఫస్ట్ షోస్ చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను చెప్పేస్తున్నారు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు డిజాస్టర్స్ తర్వాత రవితేజ నటించిన ఈ సినిమా ఎలా ఉంది ?.. మాస్ మాహారాజా ఖాతాలో మరో హిట్టు పడిందా ? అనేది తెలుసుకుందామా.

ఈగల్ సినిమా రవితేజ మాస్ జాతర అని.. అలాగే కార్తీక్ ఘట్టమనేని విజువల్స్ నెక్ట్స్ లెవల్లో చూపించాడని అంటున్నారు. ఇక డైలాగ్స్ కూడా అదరిపోయాయని.. మాస్ మాహారాజా అభిమానులకు ఇక పూనకాలే అంటూ రివ్యూ ఇచ్చాడు ఓ నెటిజన్.

అలాగే ఈగల్ సూపర్ డూపర్ సినిమా అని.. పర్ఫెక్ట్ కమర్షియల్ యాక్షన్ సినిమా అని.. రవితేజను బాగా చూపించారని.. కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ బాగుందని మరో నెటిజన్ కామెంట్ చేశారు. చాలా కాలం తర్వాత రవితేజ అదిరిపోయే కమ్ బ్యా్క్ ఇచ్చాడని మరో అభిమాని ట్వీట్ చేశారు. ఈగల్ సినిమా విజువల్ క్వాలిటీ.. రవితేజ సరికొత్త అవతారం అదిరిపోయిందని అంటున్నారు. ఈగల్ సినిమా రవితేజ వన్ మ్యాన్ షో అని.. మాస్ ఊచకోత అని.. ఎలివేషన్స్, సినిమాటోగ్రఫీ, బీజీఎమ్, మొత్తానికి.. ఎక్సలెంట్ సినిమా అని.. ఎమోషన్స్, స్టోరీ అదిరిపోయిందని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.